నిద్రలో ఎందుకు మాట్లాడతారో తెలుసా? మెదడులో జరిగేది ఇదే..!
- మూడింట రెండొంతుల మందికి నిద్రలో మాట్లాడే అలవాటు
- నిద్రలోనూ మెదడులో కొన్ని భాగాలు చురుగ్గానే ఉంటాయంటున్న నిపుణులు
- మాట్లాడడం, భాష రూపకల్పన భాగాలు చురుగ్గా ఉండడం వల్ల నిద్రలో మాటలు
- అదే సమయంలో మాటలను అడ్డుకునే వ్యవస్థ చురుగ్గా ఉండకపోవచ్చు
- ఆర్‌ఈఎం నిద్రలో మాటలకు కలలకు సంబంధం
రాత్రి గాఢంగా నిద్రపోతున్న వ్యక్తి అకస్మాత్తుగా ఏదో మాట్లాడటం మీరు ఎప్పుడైనా గమనించారా? పక్కన ఎవరూ లేకపోయినా ఎవరితోనో మాట్లాడుతున్నట్లు ప్రశ్నలు వేయడం, సమాధానాలు చెప్పడం, నవ్వడం, గుసగుసలాడటం కూడా చేస్తుంటారు. మరుసటి రోజు అడిగితే మాత్రం అసలు ఏమీ గుర్తుండదు. ఇంతకీ నిద్రలో ఉన్నప్పుడు మనం ఎందుకు మాట్లాడతాం? ఆ మాటలకు కలలకు ఏమైనా సంబంధం ఉందా?
నిద్రలో మాట్లాడటాన్ని ‘స్లీప్ టాకింగ్’ అంటారు. ఇది చాలా సాధారణమైన విషయం. మూడింట రెండొంతుల మందికి ఇలా జరిగే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. సాధారణంగా దీనివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు.
మెదడు మాత్రం పూర్తిగా నిద్రపోదు!
మనకు నిద్ర అంటే శరీరం, మెదడు పూర్తిగా విశ్రాంతి తీసుకునే సమయం అనిపిస్తుంది. కానీ వాస్తవానికి నిద్రలోనూ మెదడులోని కొన్ని భాగాలు చురుగ్గానే పనిచేస్తుంటాయి. రాత్రంతా మనం ఒకే రకమైన నిద్రలో ఉండము. దాదాపు 90 నిమిషాల సైకిల్స్‌లో నిద్ర దశలు మారుతూ ఉంటాయి.
వాటిలో ‘ర్యాపిడ్ ఐ మూమెంట్’ (ఆర్‌ఈఎం) నిద్ర ఒకటి. ఈ దశలోనే సాధారణంగా స్పష్టమైన కలలు ఎక్కువగా వస్తాయి. మిగతా సమయం ‘నాన్-ఆర్‌ఈఎం’ నిద్రలో గడుస్తుంది. ఇది శరీరానికి విశ్రాంతి ఇవ్వడంతో పాటు మెదడు, శరీరం తమను తాము పునరుద్ధరించుకునే కీలక సమయం.
నిద్రలో మాటలు ఎలా వస్తాయి?
ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం ఉంది. నిద్రలో ఉన్నప్పుడు మెదడంతా ఒకేసారి ‘ఆఫ్’ అవ్వదు. మాట్లాడటానికి, భాషను రూపొందించడానికి సంబంధించిన మెదడు భాగాలు చురుగ్గా ఉన్న సమయంలో.. మనం నోటితో మాట్లాడకుండా అడ్డుకునే వ్యవస్థ పూర్తిగా మేల్కొని ఉండకపోవచ్చు. దీంతో మనకు తెలియకుండానే మాటలు బయటకు వస్తాయి.
అయితే నిద్రలో మాట్లాడే మాటలు ఎప్పుడూ స్పష్టంగా ఉండవు. చాలాసార్లు అవి గుసగుసలు, అస్పష్టమైన శబ్దాలు, నవ్వులు మాత్రమే. కొన్నిసార్లు మాత్రం పూర్తిగా అర్థమయ్యే మాటలు వస్తాయి. ప్రశ్నలు అడగడం, ఎవరో ఎదుట ఉన్నట్లు సమాధానం చెప్పడం, వాదిస్తున్నట్లు మాట్లాడటం కూడా కనిపిస్తుంది.
కలలో ఏం జరుగుతుందో బయటకు వస్తుందా?
కొన్ని సందర్భాల్లో అవుననే చెప్పొచ్చు. ముఖ్యంగా ఆర్‌ఈఎం నిద్రలో ఒక వ్యక్తి మాట్లాడుతున్న మాటలు.. అదే సమయంలో అతను కంటున్న కలతో సరిపోలిన సందర్భాలు పరిశోధనల్లో కనిపించాయి. పరిశోధనల ప్రకారం దాదాపు 80 శాతం సందర్భాల్లో ఈ సంబంధం కనిపించింది.
అందుకే నిద్రలో మాట్లాడుతున్న వ్యక్తి ఎవరితోనో వాదిస్తున్నట్లు అనిపిస్తే.. అతను కలలో కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడేమో అనిపిస్తుంది. అయితే ప్రతి మాటా కలలో జరుగుతున్న విషయాన్నే ప్రతిబింబిస్తుందని చెప్పలేం.
నిద్రలో ఉన్నవారిని ప్రశ్నిస్తే నిజాలు చెబుతారా?
ఇది చాలామందికి ఉండే ఆసక్తికరమైన ప్రశ్న. నిద్రలో మాట్లాడుతున్న వ్యక్తిని పిలిస్తే కొన్ని సందర్భాల్లో స్పందించవచ్చు. పరిశోధనల్లో దాదాపు సగం సందర్భాల్లో నిద్రలో ఉన్నవారు బయట వ్యక్తి అడిగిన మాటలకు స్పందించినట్లు గుర్తించారు.
అయితే దీన్ని ఉపయోగించి ఎవరి రహస్యాలనైనా బయటకు తీయొచ్చని అనుకోవడం మాత్రం తప్పు. నిద్రలో మాట్లాడే వ్యక్తి తనకు తెలియకుండానే మాట్లాడుతున్నాడు. అతను చెప్పే మాటలు నిజ జీవితంలోని ఆలోచనలు, నిజాలు అని నిర్ధారించేందుకు శాస్త్రీయ ఆధారాలు లేవు.
పిల్లల్లో ఎందుకు ఎక్కువ?
పెద్దలతో పోలిస్తే పిల్లలు నిద్రలో మాట్లాడటం ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి ఒక కారణం వారి నిద్ర విధానమే కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. పిల్లల్లో లోతైన నిద్ర ఎక్కువగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ఈ నిద్ర దశలో గడిపే సమయం తగ్గుతుంది. దాంతో స్లీప్ టాకింగ్ కూడా క్రమంగా తగ్గే అవకాశం ఉంటుంది.
నిద్రలో మాట్లాడటంతో పాటు నిద్రలో నడవడం, భయంతో ఒక్కసారిగా లేవడం వంటి ఇతర నిద్ర సంబంధిత ప్రవర్తనలు కూడా పిల్లల్లో కనిపించొచ్చు. చాలా సందర్భాల్లో వయసు పెరిగేకొద్దీ ఇవి తగ్గిపోతాయి.
ఎప్పుడు జాగ్రత్త పడాలి?
అప్పుడప్పుడూ నిద్రలో మాట్లాడటం సాధారణమే. దాని గురించి ప్రత్యేకంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే తరచూ నిద్రకు అంతరాయం కలిగేలా మాట్లాడటం, నిద్రలో నడవడం, భయంతో అరవడం వంటి సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అతిగా అలసిపోయినప్పుడు స్లీప్ టాకింగ్ ఎక్కువయ్యే అవకాశం ఉంది. అంటే నిద్రలో మాట్లాడటం కొన్నిసార్లు మన శరీరం చెబుతున్న చిన్న హెచ్చరిక కూడా కావచ్చు. “నాకు కాస్త ఎక్కువ నిద్ర కావాలి” అని మన మెదడు చెప్పే విధానాల్లో ఇదొకటి కావచ్చు.