డేవిడ్‌ రెడ్డి’లో రమ్యకృష్ణ పాత్ర ఇదే.. ఫస్ట్‌లుక్‌తో అంచనాలు పెంచిన మేకర్స్

డేవిడ్‌ రెడ్డి’లో రమ్యకృష్ణ పాత్ర ఇదే.. ఫస్ట్‌లుక్‌తో అంచనాలు పెంచిన మేకర్స్

Ramya Krishna role in David Reddy makers raise expectations with first look
  • ‘కమలా రెడ్డి’గా ఆమె ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల
  • రమ్యకృష్ణ పుట్టినరోజునే పోస్టర్‌ రిలీజ్‌
  • సినిమాలో చాలా పవర్‌ఫుల్‌గా ఉండనున్న రమ్యకృష్ణ పాత్ర
  • 1897-1922 కాలం నేపథ్యంలో సాగనున్న కథ
  • ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్న హనుమా రెడ్డి యక్కంటి
మంచు మనోజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న పీరియడ్‌ యాక్షన్‌ డ్రామా ‘డేవిడ్‌ రెడ్డి’లో రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆమె పోషిస్తున్న ‘కమలా రెడ్డి’ పాత్రను పరిచయం చేస్తూ చిత్రబృందం మంగళవారం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. రమ్యకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్‌ను రిలీజ్‌ చేయడం విశేషం.

పోస్టర్‌లో రమ్యకృష్ణ చాలా గంభీరంగా, పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. ఆమె పాత్ర సినిమాలో కీలకంగా ఉండబోతున్నట్లు లుక్‌ చూస్తే అర్థమవుతోంది. ఈ పోస్టర్‌ను మంచు మనోజ్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేశారు. రమ్యకృష్ణతో కలిసి నటించడం గౌరవంగా ఉందని పేర్కొన్నారు. ఆమె స్క్రీన్‌ ప్రెజెన్స్‌, పాత్రపై పట్టు అద్భుతమని ప్రశంసించారు.

ఇప్పటికే ఈ సినిమాలో ఉక్రెయిన్‌ మోడల్‌, నటి మరియా రియాబోషప్కా ‘క్లారా విట్‌మోర్‌’గా నటిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఆమె పాత్ర ప్రేమతో పాటు ప్రతీకారం, పోరాటంతో ముడిపడి ఉంటుందని చిత్రబృందం గతంలో తెలిపింది.

‘డేవిడ్‌ రెడ్డి’కి హనుమా రెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్నారు. వెల్వెట్‌ సోల్‌ మోషన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోంది. 1897 నుంచి 1922 మధ్య కాలంలో కథ సాగనుంది. చరిత్ర నేపథ్యంలో సాగే ఈ యాక్షన్‌ డ్రామాలో బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు అంశాలు ఉండనున్నాయి.

మంచు మనోజ్‌ సినీ ప్రయాణం 21 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గత ఏడాది ఆగస్టులో ఈ సినిమాను ప్రకటించారు. తన కెరీర్‌లో ఇది 21వ చిత్రమని అప్పట్లో వెల్లడించారు.
Advertisement
Ramya Krishna
David Reddy
Manchu Manoj
Kamala Reddy
David Reddy First Look
Hanuman Reddy Yakkanti

More Telugu News