ఇంట్లో నాఫ్తలీన్ బాల్స్ వాడుతున్నారా? డాక్టర్ల షాకింగ్ హెచ్చరిక..!
- నాఫ్తలీన్ వాసనను తరచూ పీల్చడం సురక్షితం కాదంటున్న డాక్టర్లు
- అధిక మోతాదు ఎర్ర రక్తకణాలను దెబ్బతీయొచ్చని హెచ్చరిక
- పిల్లలు నాఫ్తలీన్ బాల్స్‌ను మింగే ప్రమాదం
- బాత్‌రూమ్‌లలోనూ నాఫ్తలీన్ వాడొద్దని నిపుణుల సూచన
- దుస్తులకు సీల్డ్ స్టోరేజ్, శుభ్రత, పొడిదనం మంచి ప్రత్యామ్నాయాలు
చలికాలం దుస్తులను భద్రపరిచేటప్పుడు నాఫ్తలీన్ బాల్స్ వేయడం చాలా ఇళ్లలో సాధారణమే. అల్మారాల్లో పురుగులు పట్టకుండా ఉండేందుకు వీటిని ఉపయోగిస్తుంటారు. కొందరు బాత్‌రూమ్‌లు, టాయిలెట్లలోనూ వేస్తుంటారు. అయితే వీటిలో ఉండే నాఫ్తలీన్ ఓ రసాయన పురుగుమందు. దీని వాసనను ఎక్కువసేపు పీల్చడం, పొరపాటున మింగడం, చర్మానికి ఎక్కువగా తగలడం ఆరోగ్యానికి హాని కలిగించవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
వాసన ఎందుకు వస్తుంది?
నాఫ్తలీన్ బాల్ కరగకపోయినా వాసన రావడం సహజమే. గది ఉష్ణోగ్రత వద్దే దాని అణువులు నెమ్మదిగా గాల్లోకి చేరుతాయి. దీన్నే ‘సబ్లిమేషన్’ అంటారు. అందుకే అల్మారా తెరిచిన వెంటనే ఘాటైన వాసన వస్తుంది. మూసి ఉన్న అల్మారాల్లో గాలి ప్రసరణ తక్కువగా ఉంటే ఆవిర్లు పేరుకుపోయే అవకాశం ఉంటుంది. అల్మారా తలుపులు తెరిచి గాలి ప్రసరించేలా చేయడం వల్ల ఆవిరి కొంత తగ్గుతుంది.
శరీరంలోకి వెళ్తే ఏం జరుగుతుంది?
మరెంగో ఆసియా హాస్పిటల్స్ గురుగ్రామ్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ పంకజ్ ఖటానా ప్రకారం.. నాఫ్తలీన్ వాసనను తరచూ పీల్చడం సురక్షితం కాదు. తలనొప్పి, వికారం, తల తిరగడం, కళ్లకు-ముక్కుకు మంట, నీరసం వంటి సమస్యలు రావచ్చు. ఎక్కువ మోతాదులో శరీరంలోకి వెళ్తే ఎర్ర రక్తకణాలు దెబ్బతిని రక్తహీనతకు దారితీయవచ్చు. కాలేయం, మూత్రపిండాలు, నాడీ వ్యవస్థపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.
పిల్లలకు మరింత ప్రమాదం
పిల్లల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. చిన్న పరిమాణంలో ఉండటం, వస్తువులను నోట్లో పెట్టుకునే అలవాటు కారణంగా ప్రమాదం పెరుగుతుంది. నాఫ్తలీన్ బాల్‌ను పొరపాటున మింగితే తీవ్ర విష ప్రభావం కలగవచ్చు. అందుకే పిల్లలు ఉండే గదుల్లో, వారు నిద్రించే ప్రదేశాల్లో వీటిని వాడకపోవడం మంచిది. ఆహార పదార్థాలు పెట్టే డబ్బాల్లో వీటిని నిల్వ చేయకూడదు.
పెంపుడు జంతువులకూ ముప్పే
కుక్కలు, పిల్లులు నాఫ్తలీన్ బాల్స్‌ను కొరికినా, మింగినా తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. వాంతులు, కడుపు నొప్పి, నీరసం, రక్తహీనత, నాడీ సంబంధ సమస్యలు, అవయవాల దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. నేలపై వీటిని వదిలేయడం మరింత ప్రమాదకరం.
బాత్‌రూమ్‌లో వేయొచ్చా?
సాధారణంగా బాత్‌రూమ్‌లు, టాయిలెట్లలో దుర్వాసన పోగొట్టేందుకు లేదా పురుగులను తరిమేందుకు నాఫ్తలీన్ బాల్స్ వాడకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గాలి ప్రసరణ సరిగా లేని ప్రదేశాల్లో ఆవిర్లకు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంటుంది. బెడ్‌రూమ్‌లు, పిల్లల గదుల్లోనూ వీటిని ఉపయోగించకపోవడం మంచిది.
దుస్తులను ఎలా కాపాడుకోవాలి?
నాఫ్తలీన్‌కు బదులుగా దుస్తులను శుభ్రంగా, పూర్తిగా ఆరబెట్టి భద్రపరచడం మంచి పద్ధతి. గాలి చొరబడని కంటైనర్లు లేదా గార్మెంట్ బ్యాగుల్లో ఉంచాలి. అల్మారాలను పొడిగా, అస్తవ్యస్తంగా లేకుండా చూసుకోవాలి. ఎక్కువకాలం నిల్వ చేసిన దుస్తులను మధ్య మధ్యలో బయటకు తీసి గాలి తగిలించాలి.
వాసన ఉంటే ఉతికితే సరిపోతుందా?
దుస్తులను ఉతకడం వల్ల కొంత రసాయన అవశేషం తొలగొచ్చు. కానీ పూర్తిగా పోతుందని చెప్పలేం. దుస్తులకే కాకుండా అల్మారా, స్టోరేజ్ బాక్సుల్లోనూ ఆవిర్లు లేదా అవశేషాలు ఉండొచ్చు. అందుకే దుస్తులను ఉతకడంతో పాటు వాటిని బాగా గాలి తగిలేలా చేయాలి. అల్మారా, నిల్వ ప్రదేశాన్ని కూడా శుభ్రం చేసి గాలి ప్రసరించేలా చేసిన తర్వాతే మళ్లీ ఉపయోగించడం మంచిది.