ఆస్కార్ బరిలో భారతీయ చిత్రం.. 'ది డ్రాగన్ లెటర్'కు అరుదైన గౌరవం
- స్టూడెంట్ అకాడమీ అవార్డుల్లో లడఖ్ ఫిల్మ్‌మేకర్‌కు స్వర్ణం
- 'ది డ్రాగన్ లెటర్' షార్ట్ ఫిల్మ్‌కు దక్కిన ప్రతిష్ఠాత్మక పురస్కారం
- మారుమూల గ్రామం నుంచి అకాడమీ స్థాయికి ఎదిగిన స్టాంజిన్ జిగ్మెట్
- ఆస్కార్ అవార్డుల పోటీకి అర్హత సాధించిన ‘ది డ్రాగన్ లెటర్’
లడఖ్‌కు చెందిన యువ ఫిల్మ్‌మేకర్ స్టాంజిన్ జిగ్మెట్ అంతర్జాతీయ వేదికపై సత్తా చాటాడు. ఆయన దర్శకత్వం వహించిన 'ది డ్రాగన్ లెటర్' అనే షార్ట్ ఫిల్మ్ ప్రతిష్ఠాత్మక 53వ స్టూడెంట్ అకాడమీ అవార్డుల్లో 'నరేటివ్' విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకుంది. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా సోమవారం జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
హిమాలయాలలోని లడఖ్‌లోని మారుమూల ముల్బెఖ్ గ్రామానికి చెందిన స్టాంజిన్, స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఫిల్మ్ డైరెక్షన్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. లడఖ్‌లో 'పిక్సెల్ ఛాలెంజర్ ఫిల్మ్స్' పేరుతో ఆయన ఒక ప్రొడక్షన్ హౌస్‌ను కూడా నడుపుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా 894 యూనివర్సిటీల నుంచి వచ్చిన 2,972 ఎంట్రీల నుంచి 'ది డ్రాగన్ లెటర్' ఎంపిక చేయడం విశేషం.
ఈ విజయంపై జిగ్మెట్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యాడు. "లడఖ్‌లోని ఓ మారుమూల గ్రామం నుంచి అకాడమీ అవార్డు వరకు సాగిన ఈ ప్రయాణం ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. ఈ పురస్కారం నా కుటుంబం, స్నేహితులు, నటీనటులు, సాంకేతిక బృందం, నా కథను నమ్మిన ప్రతి ఒక్కరికీ చెందుతుంది. మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మన కథలు ఎంత దూరం ప్రయాణిస్తాయో నిర్ణయించలేదు" అని ఆయన రాసుకొచ్చాడు.
ఇదే కేటగిరీలో కెనడాకు చెందిన 'ది పిచెనోట్' చిత్రానికి రజతం, పోలాండ్‌కు చెందిన 'కామాఠిపురా ఎక్స్‌ప్రెస్' చిత్రానికి కాంస్యం లభించాయి. స్టూడెంట్ అకాడమీ అవార్డు గెలుచుకున్న చిత్రాలన్నీ నేరుగా ఆస్కార్ అవార్డుల్లో లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో పోటీ పడేందుకు అర్హత సాధిస్తాయి.