స్టీల్ వాటర్ బాటిల్‌ను ఇలా శుభ్రం చేస్తే.. వాసన, మరకలు మాయం
- స్టీల్ బాటిల్‌ను తరచూ శుభ్రం చేయాలంటున్న నిపుణులు
- బేకింగ్ సోడా మరకలు, వాసనను తొలగించే అవకాశం
- వెనిగర్‌తో మొండి మురికికి చెక్
- సహజంగా శుభ్రం చేసే నిమ్మరసం, ఉప్పు
- మూతను ప్రత్యేకంగా కడగితే మేలు
స్కూల్, కాలేజీ, ఆఫీసులకు వెళ్లేటప్పుడు చాలామంది వాటర్ బాటిల్ వెంట తీసుకెళ్తుంటారు. వీటిలో స్టెయిన్‌లెస్ స్టీల్ బాటిళ్లకు ప్రత్యేక ఆదరణ ఉంది. నీటితో పాటు టీ, కాఫీ, ఇతర వేడి, చల్లని పానీయాలను కూడా వీటిలో నిల్వ చేసుకోవచ్చు. అయితే రోజూ ఉపయోగించడం వల్ల బాటిల్ అడుగున మరకలు, మూత చుట్టూ మురికి పేరుకుపోతాయి. కొన్నిసార్లు దుర్వాసన కూడా వస్తుంది. అందుకే బాటిల్‌ను ఎప్పటికప్పుడు సరిగా శుభ్రం చేయాలి.
బేకింగ్ సోడాతో..
బాటిల్‌లోని మరకలు, దుర్వాసన తొలగించేందుకు బేకింగ్ సోడా ఉపయోగపడుతుంది. ఒక టేబుల్‌స్పూన్ బేకింగ్ సోడాను గోరువెచ్చని నీటిలో కలిపి బాటిల్‌లో పోయాలి. కొన్ని గంటలు అలాగే ఉంచి తర్వాత బాగా కడగాలి.
వెనిగర్‌తో శుభ్రం..
తెల్ల వెనిగర్ మొండి మురికిని తొలగించడంలో సహాయపడుతుంది. వెనిగర్, గోరువెచ్చని నీటిని సమాన మోతాదులో తీసుకుని బాటిల్‌లో పోయాలి. 20 నుంచి 30 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగితే సరిపోతుంది.
నిమ్మరసం, ఉప్పు..
నిమ్మరసం, కాస్త ఉప్పు వేసి బాటిల్‌ను మెల్లగా షేక్ చేయాలి. ఈ మిశ్రమం మరకలను తొలగించడంతో పాటు బాటిల్‌కు తాజా వాసన వచ్చేలా చేస్తుంది. తర్వాత స్వచ్ఛమైన నీటితో బాగా కడగాలి.
మూతను విడిగా కడగాలి..
బాటిల్ మూతలోని చిన్న గీతలు, రబ్బర్ సీల్ దగ్గర తేమ, మురికి పేరుకునే అవకాశం ఉంటుంది. అందుకే మూతను విడిగా తీసి గోరువెచ్చని సబ్బు నీటితో శుభ్రం చేయాలి.
బాగా ఆరబెట్టాలి..
కడిగిన వెంటనే బాటిల్‌కు మూత పెట్టకూడదు. మూత తీసి పూర్తిగా గాలి తగిలేలా ఆరబెట్టాలి. తడి బాటిల్‌ను అలాగే మూసి ఉంచితే దుర్వాసన రావచ్చు.