పండగల సీజన్‌లో 2.5 లక్షల ఉద్యోగాలు.. యువతకు భారీ అవకాశాలు!

Festive Season Hiring to Create 25 Lakh Temporary Jobs in India
  • ఫెస్టివ్‌ హైరింగ్‌ 15 నుంచి 20 శాతం పెరగనున్నట్లు అంచనా
  • ఈ-కామర్స్‌, రిటైల్‌, లాజిస్టిక్స్‌లో ఎక్కువ అవకాశాలు
  • కంపెనీలు 12 నుంచి 14 వారాల ముందే నియామకాలు
  • టెక్నాలజీ ఆధారిత ఉద్యోగాలకు డిమాండ్‌
  • 45 శాతానికి టైర్‌-2, టైర్‌-3 నగరాల వాటా
పండగల సీజన్‌ వస్తుండటంతో దేశంలో ఉద్యోగ నియామకాల జోరు పెరగనుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఫెస్టివ్‌ హైరింగ్‌ 15 నుంచి 20 శాతం పెరుగుతుందని అంచనా. ఈ క్రమంలో 2 నుంచి 2.5 లక్షల వరకు తాత్కాలిక, గిగ్‌ ఉద్యోగాలు అందుబాటులోకి రావొచ్చని ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్‌ నివేదిక వెల్లడించింది. ఈ-కామర్స్‌, క్విక్‌ కామర్స్‌, రిటైల్‌, లాజిస్టిక్స్‌, హాస్పిటాలిటీ, ట్రావెల్‌, కన్జ్యూమర్‌ సర్వీసెస్‌ రంగాల్లో ఎక్కువ అవకాశాలు ఉండనున్నాయి.

ఈసారి కంపెనీలు పండగల సీజన్‌కు ముందుగానే నియామకాలపై దృష్టి పెడుతున్నాయి. చివరి నిమిషంలో భారీగా ఉద్యోగులను తీసుకునే విధానానికి బదులుగా.. 12 నుంచి 14 వారాల ముందే సిబ్బంది ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. సంప్రదాయ ఉద్యోగ కేంద్రాలకే పరిమితం కాకుండా కొత్త ప్రాంతాల్లోనూ ప్రతిభ కోసం వెతుకుతున్నాయి. టెక్నాలజీ ఆధారిత, అవసరమైన వెంటనే పనిలో చేరగల సిబ్బందికి డిమాండ్‌ పెరుగుతోంది.

డెలివరీ, వేర్‌హౌస్‌, ఫీల్డ్‌ ఆపరేషన్స్‌, హాస్పిటాలిటీ రంగాల్లో నియామకాలు ఎక్కువగా ఉండనున్నాయి. అదే సమయంలో డార్క్‌ స్టోర్‌ ఇన్వెంటరీ కంట్రోలర్లు, రిటర్న్స్‌-రిఫండ్స్‌ నిపుణులు, కస్టమర్‌ సపోర్ట్‌, మార్కెట్‌ప్లేస్‌ ఆపరేషన్స్‌, మోసాల నియంత్రణ, క్యాటలాగ్‌ మేనేజ్‌మెంట్‌, ఆర్డర్‌ మేనేజ్‌మెంట్‌ ఉద్యోగాలకు డిమాండ్‌ పెరుగుతోంది.

ఈసారి టైర్‌-2, టైర్‌-3 నగరాలకూ పెద్ద ఎత్తున ఉద్యోగాలు వెళ్లనున్నాయి. మొత్తం ఫెస్టివ్‌ హైరింగ్‌లో ఈ నగరాల వాటా 45 శాతం వరకు ఉండొచ్చని అంచనా. ఇక్కడ నియామకాలు 25 నుంచి 30 శాతం పెరగొచ్చని నివేదిక పేర్కొంది. జైపుర్‌, లక్నో, ఇండోర్‌, సూరత్‌, నాగ్‌పుర్‌, భువనేశ్వర్‌, కోయంబత్తూర్‌, చండీగఢ్‌, కొచ్చి నగరాల్లో ఉద్యోగాల డిమాండ్‌ మరింత పెరగనుంది.
Advertisement
Festive Season Hiring
NLB Services
Gig Economy Jobs
Ecommerce Logistics Employment
Tier 2 City Jobs
Temporary Job Opportunities

More Telugu News