శాసనమండలిలో మంత్రి లోకేశ్‌ ప్రవేశపెట్టిన 5 బిల్లులకు ఏకగ్రీవ ఆమోదం

Nara Lokesh 5 bills introduced in Legislative Council approved unanimously
  • శాసనమండలిలో 5 కీలక బిల్లులు ప్రవేశపెట్టిన మంత్రి లోకేశ్‌
  • విద్యా, గ్రంథాలయ, నైపుణ్య రంగాలకు సంబంధించిన బిల్లులు
  • ఆమోదం పొందిన వాటిలో ప్రైవేటు స్కిల్ వర్సిటీల బిల్లు కూడా ఉంది
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో పలు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ 5 ముఖ్యమైన బిల్లులను సభలో ప్రవేశపెట్టగా, మండలి వాటిని ఏకగ్రీవంగా ఆమోదించింది. విద్యా, గ్రంథాలయ, నైపుణ్యాభివృద్ధి రంగాలలో సంస్కరణల లక్ష్యంగా ప్రభుత్వం ఈ బిల్లులను రూపొందించింది.

నేడు జరిగిన శాసనమండలి సమావేశంలో మంత్రి లోకేశ్‌ ఈ బిల్లులను సభ ముందు ఉంచారు. మండలి ఆమోదించిన బిల్లులలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ గ్రంథాలయాల సవరణ బిల్లు-2026, ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సవరణ బిల్లు ఉన్నాయి.

వీటితో పాటు ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణ సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాసంస్థల (ఉపాధ్యాయుల కేడర్ లో రిజర్వేషన్) సవరణ బిల్లులను కూడా సభ ఆమోదించింది. రాష్ట్రంలో కొత్తగా ప్రైవేటు నైపుణ్య విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన ఏపీ ప్రైవేటు నైపుణ్య విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణ బిల్లుకు కూడా మండలి ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లులకు సభ్యులందరూ మద్దతు తెలపడంతో ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు ప్రకటించారు.
Advertisement
Nara Lokesh
Andhra Pradesh Legislative Council
AP Education Bills
Private Skill Universities Bill
AP Public Libraries Amendment Bill
Andhra Pradesh Government Reforms

More Telugu News