ఆగస్టులో టాటా కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గింపు అంటే?
- కర్వ్ ఈవీపై 2025 మోడల్ స్టాక్‌కు భారీ డిస్కౌంట్లు
- టియాగో ఈవీ, పంచ్ ఈవీపై రూ.1.45 లక్షల వరకు ప్రయోజనాలు
- నెక్సాన్ ఐసీఈపై రూ.90,000 వరకు ప్రయోజనాలు
- ఆల్ట్రోజ్‌పై రూ.70,000 వరకు ప్రయోజనాలు
- హారియర్, సఫారీపై రూ.70,000 వరకు ఆఫర్లు
కారు కొనుగోలు చేయాలనుకునేవారికి టాటా మోటార్స్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆగస్టు నెలలో పలు మోడళ్లపై భారీ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ ప్రయోజనాలు, లాయల్టీ బెనిఫిట్స్‌ను అందిస్తోంది. ముఖ్యంగా కొన్ని ఎలక్ట్రిక్ కార్లపై రూ.3.5 లక్షలకు పైగా ప్రయోజనాలు లభిస్తున్నాయి. అయితే ఈ ఆఫర్లు మోడల్, వేరియంట్, తయారీ సంవత్సరం, డీలర్‌షిప్, నగరం, అందుబాటులో ఉన్న స్టాక్, అర్హత వంటి అంశాలపై ఆధారపడి మారవచ్చు.
టియాగో, టిగోర్‌పై ఇలా..
కొత్తగా విడుదలైన టియాగో ఫేస్‌లిఫ్ట్‌పై ఆగస్టులో అధికారిక డిస్కౌంట్ లేదు. అయితే ప్రీ-ఫేస్‌లిఫ్ట్ టియాగో, టిగోర్ (XE వేరియంట్ మినహా)పై ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. రూ.15,000 వరకు క్యాష్ డిస్కౌంట్ లభిస్తోంది. రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా రూ.15,000 స్క్రాపేజ్ బెనిఫిట్ ఉంది. ఎంపిక చేసిన టియాగో యూనిట్లపై రూ.5,000 ఫ్రీడమ్ సెలబ్రేషన్ బోనస్ కూడా అందిస్తున్నారు. ప్రీ-ఫేస్‌లిఫ్ట్ టియాగో ఈవీపై మాత్రం రూ.1.45 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి.
ఆల్ట్రోజ్‌పై రూ.70 వేల ప్రయోజనాలు
టాటా ఆల్ట్రోజ్‌పై రూ.35,000 వరకు క్యాష్ బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. వీటికి అదనంగా రూ.15,000 ఎక్స్ఛేంజ్ సపోర్ట్, రూ.20,000 వరకు స్క్రాపేజ్ బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. అర్హతను బట్టి మొత్తం ప్రయోజనం మరింత పెరగవచ్చు.
పంచ్.. పంచ్ ఈవీపై భారీ తేడా
స్టాండర్డ్ టాటా పంచ్‌పై ఆగస్టులో అధికారిక ఆఫర్లు లేవు. అయితే ప్రీ-ఫేస్‌లిఫ్ట్ పంచ్ ఈవీపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. స్టాక్ అందుబాటులో ఉంటే రూ.1.45 లక్షల వరకు ప్రయోజనాలు పొందవచ్చు.
నెక్సాన్‌పై రూ.90 వేల వరకు..
టాటా నెక్సాన్ ఐసీఈ వెర్షన్‌పై ఈ నెలలో ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి. రూ.55,000 వరకు క్యాష్ డిస్కౌంట్‌తో పాటు రూ.15,000 ఎక్స్ఛేంజ్ సపోర్ట్, రూ.20,000 వరకు స్క్రాపేజ్ బెనిఫిట్ లభిస్తుంది. మొత్తంగా రూ.90,000 వరకు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. నెక్సాన్ ఈవీపై కూడా రూ.45,000 వరకు ఆఫర్లు ఉన్నాయి.
కర్వ్‌పై భారీ ఆఫర్లు
టాటా కర్వ్‌పై పలు రకాల ప్రయోజనాలను కంపెనీ అందిస్తోంది. రూ.30,000 క్యాష్ డిస్కౌంట్, రూ.40,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.45,000 స్క్రాపేజ్ బెనిఫిట్, రూ.50,000 వరకు లాయల్టీ బోనస్ పొందొచ్చు. ఇక 2025 మోడల్ ఇయర్ కర్వ్ ఈవీ స్టాక్‌పై రూ.3.5 లక్షలకు పైగా ప్రయోజనాలు లభిస్తున్నాయి.
సియెర్రాపై కూడా ఆఫర్లు
ఇటీవల మార్కెట్లోకి వచ్చిన టాటా సియెర్రా ఐసీఈపై రూ.30,000 స్క్రాపేజ్ బెనిఫిట్‌తో పాటు ఎంపిక చేసిన వేరియంట్లపై లాయల్టీ ప్రయోజనాలు ఉన్నాయి. అయితే సియెర్రా ఈవీపై ప్రస్తుతం అధికారిక డిస్కౌంట్లు లేవు.
హారియర్, సఫారిపై రూ.70 వేల వరకు
టాటా హారియర్, సఫారిపై కలిపి రూ.70,000 వరకు ప్రయోజనాలు లభించవచ్చు. రూ.10,000 క్యాష్ డిస్కౌంట్, రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.35,000 వరకు స్క్రాపేజ్ బెనిఫిట్ పొందొచ్చు.
హారియర్ ఈవీపై రూ.1 లక్ష వరకు ఫ్రీడమ్ సెలబ్రేషన్ ఆఫర్ ఉంది. రూ.50,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.75,000 వరకు స్క్రాపేజ్ బెనిఫిట్, ఇప్పటికే టాటా ఈవీ కలిగి ఉన్నవారికి రూ.1 లక్ష వరకు లాయల్టీ బెనిఫిట్ లభిస్తుంది.