ఎందుకమ్మా ఏడుస్తున్నావని అడిగేవారు లేరు: నటి శ్రీలక్ష్మి
- దశాబ్దాలుగా నవ్విస్తున్న శ్రీలక్ష్మి
- సినిమాలోకి వస్తానని అనుకోలేదన్న హాస్యనటి
- బాధ్యతల కారణంగా ఒంటరిగా మిగిలిపోయానని వెల్లడి
- ఎన్నో కష్టాలు తట్టుకుని నిలబడ్డానని వివరణ
- ప్రేక్షకుల అభిమానం - దేవుడి అనుగ్రహం ఉన్నాయని వ్యాఖ్య
శ్రీలక్ష్మి .. వెండితెరపై దశాబ్దాలుగా హాస్యాన్ని పరుగులు తీయిస్తున్న గొప్ప నటి. 1980లో తెలుగు తెరకు పరిచయమైన శ్రీలక్ష్మి, అప్పటి నుంచి ఎన్నో విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను పోషిస్తూ వెళుతున్నారు. ఆమె చేసిన కొన్ని పాత్రలను ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. తరాలు మారుతున్నా, తన జోరును కొనసాగిస్తూనే ఉన్నారు. అలాంటి శ్రీలక్ష్మి తాజాగా 'సుమన్ టీవీ'తో మాట్లాడుతూ, తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.
" నేను సినిమాలలోకి వస్తాననిగానీ .. ముఖ్యంగా హాస్యనటిగా పేరు తెచ్చుకుంటాననిగాని ఎంత మాత్రం ఊహించలేదు. మా ఫాదర్ చనిపోవడంతో, కుటుంబాన్ని నడపవలసిన బాధ్యత నాపై పడింది. అందువలన తప్పనిసరి పరిస్థితులలో నటనను మార్గంగా ఎంచుకోవలసి వచ్చింది. ఈ పాత్రను శ్రీలక్ష్మిగారైతే చాలా బాగా చేస్తారని దర్శకులు అనుకునే స్థాయికి రావడం కోసం చాలా కష్టాలు పడవలసి వచ్చింది. ఇంతకాలం నిలదొక్కుకోవడం వెనుక, ప్రేక్షకుల అభిమానం .. భగవంతుడి అనుగ్రహం ఉన్నాయనే నమ్ముతాను" అని అన్నారు.
"జీవితంలో బాధ్యతలు మోయడంలోనే చాలా సమయం గడిచిపోయింది. ఒంటరిగా మిగిలిపోయానే అనే ఒక ఆలోచన అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది .. బాధను కలిగిస్తూనే ఉంటుంది. అలాంటి ఆలోచన వచ్చినప్పుడు, స్నేహితురాళ్లతో కలిసి సరదాగా బయటికి వెళతాను. ఎందుకంటే ఎందుకు ఏడుస్తున్నావని అడిగేవారే లేనప్పుడు బాధపడుతూ కూర్చుని ప్రయోజనం లేదు. జీవితం దేవుడిచ్చిన ప్రసాదం .. అందువల్లనే ఆత్మహత్యకి సంబంధించిన ఆలోచనలు ఎప్పుడూ రానీయలేదు" అని చెప్పారు.