5 గంటల పాటు ముఖం నిండా తేనెటీగలు.. ఈ వ్యక్తి చేసిన సాహసం చూస్తే షాకవ్వాల్సిందే!
- తమిళనాడుకు చెందిన మురుగన్ అరుదైన రికార్డు
- ముఖంపై 5 గంటల 3 నిమిషాల పాటు వేలాది తేనెటీగలు
- ఈ సాహసంతో చోలన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు
- తేనెటీగల పెంపకంపై అవగాహన కల్పించడమే మురుగన్ లక్ష్యం
- రైతులు, యువతకు తేనెటీగల పెంపకం అవకాశాలను వివరించాలని యత్నం
తేనెటీగను చూస్తేనే మనం ఉలిక్కిపడతాం.. కానీ అతడి ముఖం నిండా వేలాది తేనెటీగలు కమ్ముకున్నా చలించలేదు. గంట కాదు.. రెండు గంటలు కాదు.. ఏకంగా 5 గంటల 3 నిమిషాలు వాటి మధ్య కదలకుండా కూర్చున్నాడు. తమిళనాడుకు చెందిన మురుగన్ చేసిన ఈ అసాధారణ సాహసం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
తిరునల్వేలి జిల్లా వల్లియూరుకు చెందిన మురుగన్ ఈ సాహసంతో ‘చోలన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు సంపాదించాడు. ముఖం మొత్తం భారతీయ తేనెటీగలతో కప్పి ఉంచుకుని ఏకంగా 5 గంటల 3 నిమిషాల పాటు కదలకుండా ఉన్నాడు. వేలాది తేనెటీగలు చుట్టూ ఉన్నా ఏమాత్రం భయపడకుండా అంతసేపు స్థిరంగా ఉండటం అందరి దృష్టినీ ఆకర్షించింది.
అయితే మురుగన్ లక్ష్యం కేవలం రికార్డు సృష్టించడం మాత్రమే కాదు. తేనెటీగల పెంపకంపై రైతులు, యువతలో అవగాహన కల్పించడమే తన ఉద్దేశమని తెలిపారు. తేనెటీగల పెంపకాన్ని స్థిరమైన ఉపాధి మార్గంగా మార్చుకోవచ్చని, దీనిలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని చాటిచెప్పాలనుకున్నారు. తన సాహసం ద్వారా వ్యవసాయం, స్వయం ఉపాధిపై ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇవ్వడంతో మురుగన్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.