తనను బాడీ షేమింగ్ చేస్తుండటంపై కత్రినా కైఫ్ స్పందన

తనను బాడీ షేమింగ్ చేస్తుండటంపై కత్రినా కైఫ్ స్పందన

Katrina Kaif reacts to body shaming comments after pregnancy
  • నిజమైన అందం అంటే శారీరక, మానసిక ఆరోగ్యంతో ఉండటమేనన్న కత్రిన
  • మనసును ప్రశాంతంగా ఉంచుకోవడమే అత్యంత ప్రాధాన్యమైన అంశమని వ్యాఖ్య
  • బయటి రూపం కంటే వ్యక్తిగత ఆత్మవిశ్వాసమే నిజమైన సౌందర్యమన్న కత్రిన

ప్రసవానంతరం పెరిగిన బరువుపై సోషల్ మీడియాలో జరుగుతున్న విమర్శలు, బాడీ షేమింగ్ చర్చలపై ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ స్పందించారు. తన దృష్టిలో నిజమైన అందం అంటే శారీరక, మానసిక ఆరోగ్యంతో ఉండడమేనని స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో కఠినమైన అందాల కొలతలను, నియమాలను అనుసరించినప్పటికీ, అనుభవంతో అందంపై తన దృక్పథం పూర్తిగా మారిపోయిందని తెలిపారు. శారీరక దృఢత్వాన్ని కాపాడుకుంటూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడమే అత్యంత ప్రాధాన్యమైన అంశమని, బయటికి కనిపించే రూపం కంటే వ్యక్తిగత ఆత్మవిశ్వాసమే నిజమైన సౌందర్యమని పేర్కొన్నారు.


మరోవైపు కత్రినా కైఫ్‌పై వచ్చిన నిందలు, ట్రోలింగ్‌ను ఖండిస్తూ సినీ ప్రముఖులు వరుసగా మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ కూడా స్పందిస్తూ... ప్రసవానంతరం మహిళల శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు రావడం సహజమైన ప్రక్రియ అని చెప్పారు. మహిళల శారీరక మార్పులను అర్థం చేసుకోకుండా హేళన చేయడం సరికాదని, గతంలో తాను కూడా ఇలాంటి బాడీ షేమింగ్ విమర్శలను ఎన్నోసార్లు ఎదుర్కొన్నానని గుర్తుచేసుకున్నారు. మహిళలు ఇతరుల విమర్శలను పట్టించుకోకుండా తమను తాము ప్రేమించుకోవడమే బాడీ షేమింగ్ చేసేవారికి ఇచ్చే సరైన సమాధానమని స్పష్టం చేశారు.

Advertisement
Katrina Kaif
Body shaming
Post pregnancy weight gain
Khushbu Sundar
Bollywood actress
Body positivity

More Telugu News