సినిమాలకు ఇక కఠిన నిబంధనలు.. డ్రగ్స్ సీన్లపై తప్పనిసరి హెచ్చరిక!
- సినిమాల్లో డ్రగ్స్ సీన్లకు హెచ్చరిక తప్పనిసరి
- మద్యం, డ్రగ్స్, పొగాకును గొప్పగా చూపించొద్దని స్పష్టీకరణ
- హింసను సమర్థించేలా సన్నివేశాలు ఉండొద్దని నిబంధనలు
- లైంగిక హింసను అవసరానికి మించి చూపించొద్దని రూల్స్
- చిన్నారులపై వేధింపుల చిత్రీకరణను నివారించాలని ఆదేశం
సినిమాల్లో ఏం చూపించాలనే విషయంలో ఇక మరింత కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. డ్రగ్స్, హింస, లైంగిక హింస, చిన్నారులపై వేధింపుల వంటి సున్నిత అంశాల చిత్రీకరణపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చింది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ)కు సంబంధించిన సవరించిన మార్గదర్శకాలను ప్రకటించింది. 1991లో జారీ చేసిన నిబంధనల స్థానంలో ఇవి వచ్చాయి.
డ్రగ్స్ తీసుకోవడం లేదా అక్రమంగా తరలించే సన్నివేశాలు ఉంటే ఇక తెరపై తప్పనిసరిగా హెచ్చరిక కనిపించాలి. “Illicit narcotics destroy health and guarantees imprisonment. Say No To Drugs” అనే సందేశాన్ని ప్రదర్శించాలి. మద్యం, డ్రగ్స్, పొగాకు అలవాట్లను సమర్థించేలా లేదా గొప్పగా చూపించే సన్నివేశాలు సినిమాల్లో ఉండొద్దని నిబంధనలు చెబుతున్నాయి.
హింసను సమర్థించేలా కానీ, గొప్పగా చూపించేలా కానీ సన్నివేశాలు ఉండకూడదు. మహిళలను కించపరిచే సన్నివేశాలు, లైంగిక వేధింపులు, లైంగిక హింసను అవసరానికి మించి చూపించకూడదు. కథకు తప్పనిసరిగా అవసరమైన సందర్భాల్లోనూ ఇలాంటి సన్నివేశాలను సాధ్యమైనంత తక్కువగా ఉంచాలని నిబంధనలు చెబుతున్నాయి.
చిన్నారులను హింసకు బాధితులుగా, హింసకు పాల్పడేవారిగా చూపించడాన్ని కూడా నివారించాలని సూచించారు. పిల్లలపై ఎలాంటి వేధింపులనూ చూపించకూడదు. దివ్యాంగులను ఎగతాళి చేసేలా, అవమానించేలా సన్నివేశాలు ఉండకూడదు. జంతువులపై అనవసరమైన హింసను కూడా చూపించొద్దని నిబంధనల్లో స్పష్టం చేశారు.
మతాలు, వర్గాలను కించపరిచేలా ఉండే మాటలు, దృశ్యాలపై ఆంక్షలు కొనసాగనున్నాయి. సామాజిక విద్వేషం, మూఢనమ్మకాలు, శాస్త్రవిరుద్ధ భావనలు, దేశ వ్యతిరేక ధోరణులను ప్రోత్సహించే కంటెంట్‌కు కూడా చోటు ఉండదు. కోర్టుల గౌరవాన్ని దెబ్బతీసే సన్నివేశాలపైనా నిబంధనలు ఉన్నాయి.
వయసును బట్టి సర్టిఫికెట్
2025 మేలో తీసుకొచ్చిన వయసు ఆధారిత వర్గీకరణనే కొత్త మార్గదర్శకాల్లోనూ కొనసాగించారు. U/A 7+, U/A 13+, U/A 16+ కేటగిరీలు అమల్లో ఉంటాయి. అలాగే సినిమా టైటిళ్లు రెచ్చగొట్టేలా, అసభ్యంగా లేదా అభ్యంతరకరంగా ఉన్నాయా? అన్నదీ సీబీఎఫ్‌సీ పరిశీలించనుంది. కొత్త మార్గదర్శకాలు వెంటనే అమల్లోకి వచ్చినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.