ఫస్ట్ ఎయిడ్‌లో ఈ తప్పులు చేస్తున్నారా? ఆపదలో మరింత ప్రమాదం తప్పదు!
- గాయపడిన వ్యక్తిని అనవసరంగా కదపొద్దు
- స్పృహ లేనివారికి ఆహారం, నీళ్లు ఇవ్వొద్దు
- మూర్ఛలో నోట్లో ఏదీ పెట్టొద్దు
- కాలిన గాయంపై ఐస్, టూత్‌పేస్ట్ రాయొద్దు
- రక్తస్రావంపై కట్టు పదేపదే తీయొద్దు
ఎవరైనా అకస్మాత్తుగా కుప్పకూలినా.. ప్రమాదంలో గాయపడినా.. కాలిన గాయమైనా వెంటనే ఏదో ఒకటి చేయాలని అనిపిస్తుంది. కానీ అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించడం మాత్రమే కాదు.. సరైన విధంగా స్పందించడం కూడా చాలా ముఖ్యం. తెలియక చేసే కొన్ని ఫస్ట్ ఎయిడ్ చర్యలు పరిస్థితిని మరింత చేయిదాటేలా చేసే ప్రమాదం ఉంది. మరి ఎలాంటి తప్పులకు దూరంగా ఉండాలి?
గాయపడిన వ్యక్తిని వెంటనే కదపొద్దు
రోడ్డు ప్రమాదం, ఎత్తు నుంచి పడటం వంటి ఘటనల్లో గాయపడిన వ్యక్తిని వెంటనే పైకి లేపడం లేదా మరోచోటికి తరలించడం ప్రమాదకరం. వెన్నెముకకు గాయం అయి ఉంటే కదిలించడం వల్ల పరిస్థితి మరింత దిగజారొచ్చు. వెంటనే ప్రమాదం పొంచి లేకపోతే వ్యక్తిని అలాగే ఉంచి వైద్య సాయం కోసం ప్రయత్నించాలి. అయితే శ్వాసకు ఇబ్బంది ఉంటే శ్వాస మార్గాన్ని తెరిచి ఉంచడం ముందుగా చేయాలి.
స్పృహలో లేని వ్యక్తికి నీళ్లు, ఆహారం ఇవ్వొద్దు
బలహీనంగా కనిపిస్తున్నారని.. నీళ్లు లేదా ఆహారం ఇవ్వడం సరికాదు. స్పృహ తగ్గిన వ్యక్తికి సరిగ్గా మింగడం సాధ్యం కాకపోవచ్చు. దీంతో ఆహారం, నీళ్లు శ్వాసనాళంలోకి వెళ్లి ఉక్కిరిబిక్కిరి అయ్యే ప్రమాదం ఉంది. మందులు కూడా ఇవ్వకూడదు. వ్యక్తి శ్వాస తీసుకుంటున్నా స్పృహలో లేకపోతే, వెన్నెముక గాయంపై అనుమానం లేనప్పుడు రికవరీ పొజిషన్‌లో ఉంచవచ్చు.
మూర్ఛ వచ్చినప్పుడు నోట్లో ఏదీ పెట్టొద్దు
మూర్ఛ వచ్చిన వ్యక్తులు నాలుక మింగేస్తారని చాలామందిలో అపోహ ఉంది. అందుకే నోట్లో చెంచా, గుడ్డ, వేళ్ల వంటి వాటిని పెడుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం. నోటికి గాయాలు కావచ్చు. శ్వాసకు అడ్డంకి ఏర్పడొచ్చు. మూర్ఛ వచ్చిన వ్యక్తిని బలవంతంగా పట్టుకోవద్దు. చుట్టుపక్కల ఉన్న ప్రమాదకర వస్తువులను తొలగించి రక్షణ కల్పించాలి.
కాలిన గాయంపై ఐస్, టూత్‌పేస్ట్ రాయొద్దు
కాలిన వెంటనే ఐస్, టూత్‌పేస్ట్, వెన్న, నూనె వంటి వాటిని రాయడం మంచిది కాదు. ఇవి గాయాన్ని మరింత తీవ్రం చేయొచ్చు. కాలిన ప్రాంతంపై చల్లటి నీటిని పోయాలి. చర్మానికి అంటుకోని దుస్తులు, నగలను తొలగించవచ్చు. తీవ్రమైన కాలిన గాయాలకు వెంటనే వైద్య చికిత్స అవసరం.
గాయంపై కట్టును పదేపదే తీయొద్దు
తీవ్రంగా రక్తం కారుతున్నప్పుడు శుభ్రమైన గుడ్డ లేదా డ్రెస్సింగ్‌తో గట్టిగా ఒత్తి పట్టాలి. రక్తం ఆగిందో లేదో చూడటానికి పదేపదే కట్టు తొలగించడం వల్ల గడ్డకట్టే ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. కట్టుపై నుంచి రక్తం కారితే దాన్ని తొలగించకుండా మరో గుడ్డను పైన పెట్టి ఒత్తిడి కొనసాగించాలి. గాయంలో ఏదైనా వస్తువు ఇరుక్కుంటే దాన్ని బయటకు లాగకూడదు.
కొంచెం బాగున్నంత మాత్రాన ప్రమాదం తప్పిందనుకోవద్దు
లక్షణాలు తగ్గినట్లు కనిపించినంత మాత్రాన వైద్య సాయం అవసరం లేదని భావించడం పెద్ద తప్పు. కొన్ని అత్యవసర పరిస్థితుల్లో లక్షణాలు తాత్కాలికంగా తగ్గొచ్చు. ఫస్ట్ ఎయిడ్ ఉద్దేశం సమస్యను పూర్తిగా నయం చేయడం కాదు. వైద్య సాయం అందే వరకు పరిస్థితిని అదుపులో ఉంచడమే. ప్రాణాపాయం అనిపిస్తే ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సేవలను సంప్రదించాలి. భారత్‌లో 112 జాతీయ అత్యవసర నంబర్ అందుబాటులో ఉంది.
ఫస్ట్ ఎయిడ్‌లో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం
ముందుగా మీ భద్రతను చూసుకోవాలి. ఆ తర్వాత పరిస్థితిని అంచనా వేసి వైద్య సాయం కోసం కాల్ చేయాలి. తెలిసిన, సురక్షితమైన ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలి. ఇంటి చిట్కాలతో ప్రయోగాలు చేయడం లేదా పరిస్థితి తెలియకుండా మందులు ఇవ్వడం మానుకోవాలి.
అత్యవసర పరిస్థితుల్లో ఏమీ చేయకుండా ఉండటం కాదు.. తప్పుగా చేయకుండా ఉండటం కూడా ఒక ముఖ్యమైన ఫస్ట్ ఎయిడ్ చర్యే.