ఏపీలో మరో 58 వేల మందికి ‘తల్లికి వందనం’.. క్యాబినెట్ నిర్ణయం
- ‘తల్లికి వందనం’ పథకం విస్తరణకు కేబినెట్ ఆమోదం
- కొత్తగా 58,601 మంది విద్యార్థులకు అందనున్న ప్రయోజనం
- మొత్తం లబ్ధిదారుల సంఖ్య 68 లక్షలు దాటిన వైనం
- దసరా పండుగ లోపు తల్లుల ఖాతాల్లో నగదు జమ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకం పరిధిని విస్తరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద కొత్తగా మరో 58,601 మంది విద్యార్థులను అర్హులుగా చేర్చుతూ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో పథకం ద్వారా లబ్ధి పొందే వారి సంఖ్య మరింత పెరగనుంది.
తాజా చేర్పులతో రెండో విడతలో ఆర్థిక సహాయం అందుకునే విద్యార్థుల సంఖ్య 3,29,201కి చేరుకుంటుంది. ఫలితంగా, రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం కింద అర్హులైన మొత్తం విద్యార్థుల సంఖ్య 67,47,190 నుంచి 68,05,791కి పెరగనుంది.
రెండో విడతకు సంబంధించిన నిధులను దసరా పండుగలోపు విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం ద్వారా విద్యార్థుల చదువులకు ఆర్థికంగా చేయూత అందించడమే ప్రభుత్వ ఉద్దేశం.