రాహుల్ గాంధీని తరలించే బస్సును పంక్చర్ చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు
Add ap7am to your home Screen

రాహుల్ గాంధీని తరలించే బస్సును పంక్చర్ చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు

Rahul Gandhi protest bus punctured by Congress workers in Delhi
  • నిన్నటి హైడ్రామా తర్వాత ఇండియా కూటమి లంచ్ మీటింగ్
  • జంతర్ మంతర్ వద్దకు బయలుదేరిన విపక్ష ఎంపీలు
  • బస్సును పంక్చర్ చేయడంతో మరో బస్సులో రాహుల్ గాంధీ తరలింపు
  • నా లక్ష్యం 100 ఎఫ్‌ఐఆర్‌లు అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్య
ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలతో ఢిల్లీలో రాజకీయ వేడి కొనసాగుతోంది. నిన్నటి హైడ్రామా, డిటెన్షన్ల అనంతరం 'ఇండియా' కూటమి ఎంపీలు తమ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు బుధవారం సమావేశమయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జనపథ్‌లోని సాగర్ రత్న రెస్టారెంట్‌లో ఏర్పాటు చేసిన లంచ్ మీటింగ్‌లో నేతలంతా పాల్గొన్నారు.

అనంతరం ఎంపీలు జంతర్ మంతర్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు ఎంపీలను నిరసన ప్రదేశం నుంచి తరలించేందుకు ప్రయత్నించగా నిరసనకారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

రాహుల్ గాంధీని పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి బస్సు ఎక్కించారు. అయితే, నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు బస్సును పంక్చర్ చేశాయి. దీంతో మరో బస్సులో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రియాంక గాంధీ, ఇతర ఎంపీలను మరో బస్సులో ఛత్రశాల స్టేడియానికి తరలించారు.

నా లక్ష్యం 100: ఎఫ్ఐఆర్‌లపై రాహుల్ గాంధీ

నిన్న ఆకాశవాణి భవన్ వద్ద ధర్నా చేసినందుకు తనతో పాటు ప్రియాంకా గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదు కావడంపై రాహుల్ గాంధీ స్పందించారు. "నాపై ఇప్పటికే 45 ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయి. నా లక్ష్యం 100" అని ఆయన అన్నారు. ఈ కేసుల గురించి తాము ఆందోళన చెందడం లేదని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.
 
Advertisement
Rahul Gandhi
Priyanka Gandhi
Congress Protests Delhi
Election Commission Protest
Indian National Congress
Rahul Gandhi FIR target

More Telugu News