చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల చిత్రంపై క్లారిటీ ఇచ్చిన నాని
- ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుందని, మరింత సమయం పడుతుందని స్పష్టీకరణ
- తన 'ది ప్యారడైజ్' సినిమా నిర్మాణమే ఆలస్యానికి కారణమని వెల్లడి
- ఈ సినిమాపై ఇంకా ఎలాంటి చర్చలు జరగలేదని తెలిపిన నాని
- మెగాస్టార్ కెరీర్‌లో అత్యంత వయొలెంట్ చిత్రంగా ప్రచారం
మెగాస్టార్ చిరంజీవి, 'ప్యారడైజ్' దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. నేచురల్ స్టార్ నాని సమర్పకుడిగా, నిర్మాతగా వ్యవహరించనున్న ఈ చిత్రం ఇప్పట్లో పట్టాలెక్కేలా కనిపించడం లేదు. ఈ సినిమాకు మరికొంత సమయం పడుతుందని, దీనిపై ఇంకా ఎలాంటి తాజా చర్చలు జరగలేదని నాని స్వయంగా స్పష్టం చేశారు. దీంతో ఈ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు నిరాశే ఎదురైంది.
ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని ఈ ప్రాజెక్ట్ ఆలస్యం కావడానికి గల కారణాలను వివరించారు. ది ప్యారడైజ్' సినిమా నిర్మాణం అనుకున్నదానికంటే ఎక్కువ సమయం తీసుకుందని, దీనివల్ల చిరంజీవి సినిమా షెడ్యూల్ దెబ్బతిందని తెలిపారు. "నిజానికి ఈపాటికి చిరంజీవి గారి సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉండాల్సింది. కానీ 'ది ప్యారడైజ్' ఆలస్యమవ్వడంతో కుదరలేదు. దీనిపై మేము ఇంకా కూర్చుని చర్చించుకోలేదు. దీనికి మరికొంత సమయం పడుతుంది" అని నాని స్పష్టం చేశారు. ఈలోగా చిరంజీవి కూడా కొన్ని ఇతర సినిమాలను పూర్తి చేశారని ఆయన పేర్కొన్నారు.
2024 డిసెంబర్ లో ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. చిరంజీవి కెరీర్‌లోనే 'అత్యంత వయొలెంట్ సినిమా'గా ఇది రానుందని ప్రచారం జరగడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. యంగ్ టాలెంటెడ్ డైరక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తుండటంతో ఈ కాంబినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, చిరంజీవి, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డేట్లు తిరిగి సర్దుబాటు అయ్యాక మాత్రమే ఈ ప్రాజెక్ట్‌పై తదుపరి అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది. సినిమా ఆలస్యమైనప్పటికీ, ఈ క్రేజీ కాంబినేషన్ కోసం మెగా అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.