కొందరు తరాలకు స్ఫూర్తినిస్తారు.. ఆయనతో నటించడం విలువైన అధ్యాయం: ఏఎన్నార్‌పై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
- ఏఎన్నార్ జయంతి సందర్భంగా స్మరించుకున్న చిరంజీవి
- తరాలకు స్ఫూర్తిగా నిలిచిన మహానటుడని కొనియాడిన మెగాస్టార్
- 'మెకానిక్ అల్లుడు' చిత్రంలో కలిసి నటించిన అనుభవాన్ని గుర్తుచేసుకున్న చిరు
- ఏఎన్నార్ సినీ వారసత్వం ఎప్పటికీ నిలిచిపోతుందని వ్యాఖ్య
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనను స్మరించుకుంటున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి, ఏఎన్నార్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగ పోస్ట్ చేశారు. క్రమశిక్షణ, అంకితభావానికి మారుపేరైన ఏఎన్నార్ గొప్పతనాన్ని కొనియాడారు.
"కొంతమంది నటులు తరాలను అలరిస్తారు. మరికొందరు తరాలకు స్ఫూర్తిగా నిలుస్తారు" అంటూ చిరంజీవి తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అక్కినేని నాగేశ్వరరావు ఈ రెండు కోవలకు చెందిన వారని ఆయన ప్రశంసించారు.
ఏఎన్నార్‌తో కలిసి నటించిన మధుర జ్ఞాపకాలను చిరంజీవి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. 1993లో వచ్చిన ‘మెకానిక్ అల్లుడు’ చిత్రంలో ఆయనతో కలిసి నటించడం తన సినీ ప్రయాణంలో ఓ విలువైన అధ్యాయమని తెలిపారు.
ఏఎన్నార్ భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన సినిమాలు, ఆయన పోషించిన పాత్రల ద్వారా ఎప్పటికీ జీవించే ఉంటారని చిరంజీవి అన్నారు. ఆయన సినీ వారసత్వం శాశ్వతంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.