పండుగ రద్దీకి రైల్వే ఏర్పాట్లు.. ఏపీ, తెలంగాణ మధ్య ప్రత్యేక రైళ్లు
- దసరా పండుగ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రకటన
- చర్లపల్లి - శ్రీకాకుళం మధ్య మొత్తం 16 సర్వీసులు
- అక్టోబర్, నవంబర్ నెలల్లో అందుబాటులోకి
- విజయవాడ, రాజమండ్రి, విజయనగరం మీదుగా ప్రయాణం
- చర్లపల్లి - నాగర్‌కోయిల్ మార్గంలో మరో 10 ప్రత్యేక సర్వీసులు
దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీని నివారించేందుకు చర్లపల్లి - శ్రీకాకుళం మధ్య 16 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైళ్లను అక్టోబర్, నవంబర్ నెలల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు.
షెడ్యూల్ వివరాల ప్రకారం.. రైలు నంబర్ 07037 (చర్లపల్లి - శ్రీకాకుళం) అక్టోబర్ 6, 13, 20, 27 తేదీలతో పాటు నవంబర్ 3, 10, 17, 24 తేదీల్లో నడవనుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 07038 (శ్రీకాకుళం - చర్లపల్లి) అక్టోబర్ 7, 14, 21, 28 మరియు నవంబర్ 4, 11, 18, 25 తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, సింహాచలం, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్లలో ఆగుతాయి.
వీటితో పాటు చర్లపల్లి - నాగర్‌కోయిల్ మార్గంలోనూ 10 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైలు నంబర్ 07535 సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 23 వరకు ప్రతి శుక్రవారం, రైలు నంబర్ 07536 సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 25 వరకు ప్రతి ఆదివారం నడవనున్నాయి. పండుగ సీజన్‌లో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు ఈ ప్రత్యేక సర్వీసులను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.