మోదీని అనుకరించిన రాహుల్ గాంధీ.. ఇది దిగజారుడు రాజకీయమన్న బీజేపీ
- ఇండోర్ సభలో ప్రధాని మోదీని మిమిక్రీ చేసిన రాహుల్ గాంధీ
- రాహుల్ తీరుపై బీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం, విమర్శలు
- వృద్ధులను, తల్లులను రాహుల్ అవమానించారని బీజేపీ ఆరోపణ
- రాజకీయ గౌరవానికి రాహుల్ మచ్చ తెచ్చారన్న ఉత్తరాఖండ్ సీఎం
- దేశ ప్రయోజనాల కోసమే ప్రధాని పనిచేయాలని రాహుల్ హితవు
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, హావభావాలు ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఇండోర్‌లో శనివారం జరిగిన 'ఛాత్రోం కీ గూంజ్' కార్యక్రమంలో స్టాండప్ కమెడియన్ పుల్కిత్ మణితో కలిసి రాహుల్ గాంధీ వేదికపై ప్రధాని మోదీని అనుకరించారు. దీనిపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇది దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడుతున్నారు.
ఈ ఘటనపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ తీవ్రంగా స్పందించారు. "వృద్ధురాలైన తల్లిని అవమానించేలా ఉన్న వ్యాఖ్యలను చూసి రాహుల్ గాంధీ వేదికపై గట్టిగా నవ్వారు. సభ్య సమాజంలో ఎవరూ హర్షించని ఇలాంటి చేష్టలను ఆయన ప్రోత్సహించారు. ఇలాంటి సంస్కృతి వల్లే కాంగ్రెస్ పార్టీ యువతకు దూరం అవుతోంది" అని కేశవన్ విమర్శించారు.
ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (డీయూఎస్‌యూ) ఎన్నికల్లో కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఓటమికి రాహుల్ ద్వేషపూరిత రాజకీయాలే కారణమని ఆయన ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అనుబంధ విద్యార్థి సంస్థ ఏబీవీపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
"ప్రధాని మోదీ ఒక వృద్ధురాలికి కుర్చీ వేసి గౌరవిస్తే, రాహుల్ గాంధీ మాత్రం పెద్దలను అవమానిస్తుంటే ఆనందపడ్డారు. ఇలాంటి సర్కస్ షోలను ప్రోత్సహించే రాహుల్‌ను సీరియస్ రాజకీయ నాయకుడిగా పరిగణించలేం" అని కేశవన్ వ్యాఖ్యానించారు.
రాహుల్ తీరుపై పుష్కర్ సింగ్ ధామి ఫైర్
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా రాహుల్ తీరుపై మండిపడ్డారు. రాహుల్ వాడే భాష రోజురోజుకు దిగజారిపోతోందని అన్నారు. ఆయన వ్యాఖ్యలు భారత రాజకీయాల గౌరవానికి ఒక మచ్చ లాంటివని, దేశ ప్రజలు నేతల మాటలను, విలువలను గమనిస్తున్నారని, అందుకే కాంగ్రెస్‌ను పదేపదే తిరస్కరిస్తున్నారని తెలిపారు.
అసలేం జరిగిందంటే..!
ఇండోర్ కార్యక్రమంలో పుల్కిత్ మణితో కలిసి రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ క్రమంలో ప్రధాని గొంతును అనుకరిస్తూ.. "మీరు స్నేహితుడి ఇంటికి వెళ్లడం లేదు. ప్రధాని హోదాలో స్నేహాలు చేయడం కాదు, దేశాన్ని కాపాడటమే వారి పని" అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి.