'జైలర్ 2' నుంచి క్రేజీ అప్‌డేట్.. బోధిగా ఎస్.జె. సూర్య పవర్‌ఫుల్ ఎంట్రీ!
- జైలర్ 2లో భాగమైన విలక్షణ నటుడు ఎస్.జె. సూర్య
- 'బోధి' పాత్రను పరిచయం చేస్తూ క్యారెక్టర్ ప్రోమో విడుదల
- సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన ఎస్.జె. సూర్య స్టైలిష్ లుక్
- రజనీకాంత్‌తో తొలిసారి తలపడనున్న సూర్య
- దసరా కానుకగా అక్టోబర్ 15న థియేటర్లలోకి రానున్న చిత్రం
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘జైలర్ 2’ నుంచి మేకర్స్ ఓ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో విలక్షణ నటుడు ఎస్.జె. సూర్య ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, ఆయన పాత్రను పరిచయం చేస్తూ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తాజాగా ఒక క్యారెక్టర్ ప్రోమోను విడుదల చేసింది.
ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య 'బోధి' అనే శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. విడుదలైన ప్రోమోలో ఆయన స్టైలిష్ లుక్స్, స్వాగ్, బాడీ లాంగ్వేజ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ ప్రోమోకు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన నేపథ్య సంగీతం సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన 'జైలర్'కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ (ముత్తువేల్ పాండియన్) పాత్రను ఢీకొట్టే పాత్రలో ఎస్.జె. సూర్య (బోధి) నటించనుండటం ఆసక్తి రేపుతోంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.