ఇంటర్వ్యూలో ఏఐతో చీటింగ్.. స్క్రీన్ షేర్ చేయమనగానే దొరికిపోయాడు!
- బే ఏరియా టెక్ ఇంటర్వ్యూలో ఏఐతో చీటింగ్ చేస్తూ పట్టుబడ్డ అభ్యర్థి
- సమాధానాలు అనుమానాస్పదంగా ఉండటంతో పసిగట్టిన రిక్రూటర్
- స్క్రీన్ షేర్ చేయమని కోరగానే చాట్‌బాట్ కనిపించడంతో బట్టబయలు
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘటన, అభ్యర్థిపై నెటిజన్ల విమర్శలు
- నైపుణ్యం లేకపోతే ఉద్యోగంలో నిలదొక్కుకోవడం కష్టమని హితవు
టెక్నాలజీ పెరిగేకొద్దీ మోసాలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. తాజాగా ఓ టెక్ ఉద్యోగానికి జరిగిన ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో అభ్యర్థి ఒకరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో సమాధానాలు చెబుతూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అమెరికాలోని బే ఏరియాకు చెందిన ఓ టెక్ కంపెనీలో మెషీన్ లెర్నింగ్ సిస్టమ్ డిజైన్ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే, లిల్లీ జాంగ్ అనే రిక్రూటర్ ఒక అభ్యర్థికి వర్చువల్ ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇంటర్వ్యూ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే అభ్యర్థి ప్రవర్తనపై ఆమెకు అనుమానం కలిగింది. అతను అడిగిన ప్రశ్నలకు ఏమాత్రం ఆలోచించకుండా, చాలా ధారాళంగా సమాధానాలు ఇస్తున్నాడు. అయితే ఆ సమాధానాలు సహజంగా కాకుండా, ఏదో చదివి వినిపిస్తున్నట్టుగా ఉండటంతో లిల్లీ జాంగ్ అనుమానం బలపడింది. అసలు విషయం తెలుసుకునేందుకు ఆమె ఇంటర్వ్యూను కొనసాగించారు.
ఇంటర్వ్యూలో భాగంగా సిస్టమ్ ఆర్కిటెక్చర్ గీసేందుకు స్క్రీన్‌ను షేర్ చేయమని అభ్యర్థిని లిల్లీ కోరారు. ఆ మాట వినగానే అతను ఒక్కసారిగా కంగారుపడ్డాడు. అదే సమయంలో అతని స్క్రీన్‌పై ఒక చాట్‌బాట్ విండో వేగంగా కనిపించి మాయమైంది. దీంతో అతను ఏఐ సాయం తీసుకుంటున్నాడని నిర్ధారించుకున్న లిల్లీ, వెంటనే ఇంటర్వ్యూను ముగించారు. ఈ విషయాన్ని ఆమె తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. "మోసం చేసేవారు ఇంత తేలికగా ఎలా దొరికిపోతారు? కాస్త నమ్మదగిన చీటింగ్ సాఫ్ట్‌వేర్ కొనొచ్చు కదా?" అని ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఈ తరహా మోసాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇలా మోసం చేసి ఉద్యోగం సంపాదించినా, పనిలో నైపుణ్యం చూపలేక ప్రొబేషన్ సమయంలోనే బయటపడతారని చాలామంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఏఐ నేర్చుకోవడానికి, ఇంటర్వ్యూలకు సిద్ధమవ్వడానికి ఉపయోగించుకోవాలే తప్ప, ఇలా నైపుణ్యం ఉన్నట్టు నటించడానికి వాడితే ఫలితం ఇలాగే ఉంటుందని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.