పుట్టిన రోజు సందర్భంగా, కేసీఆర్ సాక్షిగా.. పారబట్టి మొక్కనాటిన కేటీఆర్... వీడియో ఇదిగో!
- పుట్టినరోజున తండ్రి కేసీఆర్ ఆశీస్సులు అందుకున్న కేటీఆర్
- గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా కుటుంబంతో కలిసి మొక్కలు నాటిన వైనం
- భార్య శైలిమ, పిల్లలతో కలిసి వేడుకలో పాల్గొన్న కేటీఆర్
- సోషల్ మీడియాలో వైరల్ అయిన పుట్టినరోజు వీడియోలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పుట్టినరోజును శుక్రవారం కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన తనయుడికి ఆశీస్సులు అందించి, నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లాలని దీవించారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని కేటీఆర్ స్వయంగా పార పట్టి, తండ్రి సమక్షంలో మొక్క నాటి మట్టి పోయడం విశేషం.
మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా కేటీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యవసాయ క్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు కేసీఆర్, కేటీఆర్ భార్య శైలిమ, కుమారుడు హిమాన్షు, కుమార్తె రియాన్షి కూడా మొక్కలు నాటారు. ప్రకృతి వ్యవసాయంపై మక్కువ ఉన్న కేసీఆర్ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనడం అందరినీ ఆకట్టుకుంది.
రాజకీయాలకు అతీతంగా, పూర్తి కుటుంబ వాతావరణంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను బీఆర్ఎస్ పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకుంది. ఈ పోస్టులు సామాజిక మాధ్యమాల్లో స్వల్ప వ్యవధిలోనే వైరల్ అయ్యాయి. అటు కుటుంబ బంధాలకు, ఇటు పర్యావరణ స్పృహకు ప్రతీకంగా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు సాగాయని పార్టీ శ్రేణులు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.