టీ20 క్రికెట్‌లో మరో ఘనత... క్రిస్ గేల్‌ను దాటేసిన జోస్ బట్లర్
- రెండో అత్యధిక పరుగుల వీరుడిగా రికార్డు
- 'ది హండ్రెడ్' లీగ్‌లో ఈ మైలురాయిని అందుకున్న ఇంగ్లండ్ బ్యాటర్
- తొలి స్థానంలో కొనసాగుతున్న కీరన్ పొలార్డ్
- మొత్తం 14,572 పరుగులతో రెండో స్థానంలో బట్లర్
ఇంగ్లండ్ స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ జోస్ బట్లర్ టీ20 క్రికెట్‌లో మరో ఘనత అందుకున్నాడు. ఈ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్‌ను అధిగమించి రెండో స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుతం జరుగుతున్న 'ది హండ్రెడ్ 2026' టోర్నమెంట్‌లో బట్లర్ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు.
మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న బట్లర్, లండన్ స్పిరిట్‌తో జరిగిన మ్యాచ్‌లో 16 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతో అతడి టీ20 కెరీర్ పరుగులు 487 ఇన్నింగ్స్‌లలో 14,572కు చేరాయి. ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న క్రిస్ గేల్ (455 ఇన్నింగ్స్‌లలో 14,562 పరుగులు) మూడో స్థానానికి పడిపోయాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ 663 ఇన్నింగ్స్‌లలో 14,803 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ఈ జాబితాలో అలెక్స్ హేల్స్ (14,449), డేవిడ్ వార్నర్ (14,284), విరాట్ కోహ్లీ (14,218) వంటి స్టార్ ఆటగాళ్లు ఆ తర్వాత స్థానాల్లో నిలిచాడు. ఇంగ్లండ్‌కు 2022లో టీ20 ప్రపంచకప్ అందించడంతో పాటు, ఐపీఎల్ వంటి ప్రముఖ లీగ్‌లలో నిలకడగా రాణిస్తున్న బట్లర్, ఈ మైలురాయితో తన కీర్తి కిరీటంలో మరో కలికితురాయిని చేర్చుకున్నాడు.