కాక్రోచ్ జనతా పార్టీపై వేణుస్వామి జోస్యం.. బీజేపీ పరిస్థితి ఏమిటంటే?
- కాక్రోచ్ జనతా పార్టీతో బీజేపీకి తీవ్ర నష్టం తప్పదన్న వేణుస్వామి
- రాజకీయ నష్టంలో 90 శాతం బీజేపీకేనని సంచలన అంచనా
- కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఖాయమని జోస్యం
దేశవ్యాప్తంగా పరీక్షల అక్రమాలపై యువత చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ)పై ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పార్టీ ఆవిర్భావం వల్ల ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని అధికార భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) రాజకీయంగా తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన జోస్యం చెప్పారు. సీజేపీ జాతక రీత్యా గ్రహగతులు బలంగా ఉన్నాయని, ఇది భవిష్యత్తులో బీజేపీకి గట్టి సవాలుగా పరిణమించనుందని విశ్లేషించారు.
ఓ సందర్భంలో యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ 'బొద్దింకలు' అని పోల్చడంతో, ఆ వ్యాఖ్యలకు నిరసనగా ఈ ఉద్యమం రూపుదిద్దుకుంది. బోస్టన్‌లో ఉన్నత విద్యనభ్యసిస్తున్న అభిజీత్ దీప్కే అనే విద్యార్థి దీన్ని ఒక క్రమబద్ధమైన ఉద్యమ కార్యాచరణగగా మలిచారు. ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.
తాజాగా సీజేపీ జాతకాన్ని విశ్లేషించిన వేణుస్వామి, ఆ పార్టీ కుండలిలో బుధాదిత్య యోగం, కాలసర్ప రాజయోగం ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు ఈ ఉద్యమానికి విశేష ప్రజాదరణ లభిస్తుందని ఆయన అంచనా వేశారు. ఒకవేళ ఈ ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే, అది అంతిమంగా బీజేపీకే ఎదురుదెబ్బగా మారుతుందని ఆయన హెచ్చరించారు.
కాక్రోచ్ జనతా పార్టీ వల్ల చేకూరే రాజకీయ నష్టంలో దాదాపు 90 శాతం బీజేపీకే ఉంటుందని ఆయన వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని, అలాగే సీజేపీకి చెందిన ముగ్గురు కీలక నేతలు జైలుకు వెళ్లే అవకాశం ఉందని వేణుస్వామి విశ్లేషించారు.