ఛత్రపతి శివాజీ పునర్జన్మే మోదీ.. లోక్ సభలో బీజేపీ ఎంపీ వ్యాఖ్య.. వీడియో ఇదిగో!
--
నాటి మరాఠా సామ్రాజ్య ఖ్యాతిని ఛత్రపతి శివాజీ దశదిశల చాటారని, ప్రస్తుతం నరేంద్ర మోదీ కూడా భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా నిలబెట్టేందుకు పాటుపడుతున్నారని వివరించారు. దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించడానికి శివాజీ మహరాజ్ పునర్జన్మ పొందారని ఎంపీ నొక్కి చెప్పారు. కాగా, ఎంపీ ప్రదీప్ పురోహిత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు, నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ తో ప్రధాని మోదీని పోల్చడం కరెక్ట్ కాదని, ఇది శివాజీ మహారాజ్‌ను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.