పప్పు ఇలా వండుతున్నారా? పోషకాలు తగ్గిపోవచ్చు.. నిపుణులు చెప్పిన ఈ చిట్కాలు ఇవిగో
- పప్పులను ఎలా వండుతున్నాం? ఎలా తింటున్నామన్నది కూడా ముఖ్యమంటున్న నిపుణులు
- పప్పులను వండే ముందు కనీసం రెండు గంటలు నానబెట్టాలని సూచన
- సహజంగా కనిపించే అన్‌పాలిష్డ్ పప్పులను ఎంచుకోవడం మంచిదని సలహా
- ఒకే రకం పప్పు తినడం కంటే రకాలు మార్చి తినడం మంచిదంటున్న నిపుణులు
- పప్పుతో సలాడ్లు, స్నాక్స్, రొట్టెల వంటివి చేసుకుంటే రోజూ తినే అవకాశం ఉంటుందని సూచన
భారతీయ వంటకాల్లో పప్పుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు ఇలా రకరకాల పప్పులు మన రోజువారీ ఆహారంలో భాగంగా ఉంటాయి. ఇవి ప్రొటీన్లు, ఇతర పోషకాలు అందించడంతో పాటు జీర్ణక్రియకు కూడా మేలు చేస్తాయి. అయితే పప్పును ఎలా వండుతున్నాం? ఎలా తింటున్నామన్నది కూడా చాలా ముఖ్యం. కొన్ని చిన్న పొరపాట్ల వల్ల పప్పులోని పోషకాలు తగ్గిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
పప్పును ముందుగా నానబెట్టాలి
పప్పును వండే ముందు కనీసం రెండు గంటలు నీటిలో నానబెట్టడం మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పప్పులో ఉండే ఫైటిక్ యాసిడ్ వంటి యాంటీ న్యూట్రియెంట్లు తగ్గుతాయి. దీంతో పప్పులోని ప్రొటీన్‌ను శరీరం మెరుగ్గా గ్రహించే అవకాశం ఉంటుంది.
అయితే పప్పును నానబెట్టిన నీటిని పారబోయకూడదు. నానబెట్టే సమయంలో బి, సి విటమిన్లలో కొంత భాగం నీటిలోకి చేరుతుంది. ఆ నీటిని పారబోస్తే ఈ పోషకాలు కూడా వృథా అవుతాయి. అయితే నానబెట్టే ముందు పప్పును మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడగాలి. దుమ్ము, పాలిష్, ఇతర మలినాలు తొలగిన తర్వాతే నానబెట్టాలి.
మెరిసే పప్పులు వద్దు
నిపుణుల సూచనల ప్రకారం.. పప్పు ఎంపికలోనూ జాగ్రత్త అవసరం. మెరుస్తూ కనిపించే పప్పులను కాకుండా సహజంగా కనిపించే అన్‌పాలిష్డ్ పప్పులను ఎంచుకోవడం మంచిది. వీటిలో సహజ పోషకాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.
ఒకే పప్పుతో ఆగిపోవద్దు
రోజూ ఒకే రకం పప్పు తినడం కంటే రకాలు మార్చి తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఒక్కో రకం పప్పులో ఒక్కో రకమైన పోషకాలు ఉంటాయి. అందుకే కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు వంటి వాటిని ఆహారంలో మారుస్తూ తీసుకోవచ్చు.
పప్పుతో సలాడ్లు, స్నాక్స్, రొట్టెల వంటి వంటకాలు కూడా చేసుకోవచ్చు. ఇలా రకరకాలుగా తీసుకుంటే రోజువారీ ఆహారంలో పప్పును సులభంగా భాగం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.