ఏపీ పోర్టుల అభివృద్ధికి కేంద్రం సహకరించాలి: మంత్రి సోనోవాల్‌తో సీఎం చంద్రబాబు
- కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సోనోవాల్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- ఏపీలో సముద్ర ఆధారిత ఆర్థిక కార్యకలాపాలకు సహకరించాలని విజ్ఞప్తి
- మూలపేట, దుగరాజపట్నం పోర్టుల అభివృద్ధిపై కీలక చర్చ
- పోర్టుల అనుబంధ రంగాలతో ఉపాధి కల్పన పెరుగుతుందని వివరణ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఢిల్లీలో కేంద్ర ఓడరేవులు, నౌకాయాన శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో సముద్ర ఆధారిత ఆర్థిక కార్యకలాపాలను విస్తరించేందుకు, పోర్టుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కోరారు.
ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రంలోని పోర్టుల అభివృద్ధి, శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టులో కొత్తగా టెర్మినల్ ఏర్పాటు, దుగరాజపట్నంలో షిప్ బిల్డింగ్ సెంటర్ ఏర్పాటు వంటి కీలక అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న సుదీర్ఘ తీరప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటూ, పోర్టుల ఆధారంగా పారిశ్రామిక, వాణిజ్య అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చంద్రబాబు కేంద్రమంత్రికి వివరించారు.
ఇప్పటికే నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదిత పోర్టులకు అనుసంధానంగా షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్, మెరైన్ ఇంజినీరింగ్ వంటి రంగాలను అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు రావడంతో పాటు, యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా, శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టు అభివృద్ధి ఉత్తరాంధ్ర రూపురేఖలను మారుస్తుందని, ఈ ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలకు ఊతమిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అందువల్ల మూలపేట పోర్టుకు అవసరమైన టెర్మినల్, ఇతర మౌలిక వసతుల కల్పనలో కేంద్రం చొరవ చూపి, అవసరమైన సహాయాన్ని అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.