ఉక్రెయిన్‌పై రష్యా రాకెట్ దాడి.. బస్టాప్‌లో 33 మంది పౌరుల మృతి
Add ap7am to your home Screen

ఉక్రెయిన్‌పై రష్యా రాకెట్ దాడి.. బస్టాప్‌లో 33 మంది పౌరుల మృతి

Russia rocket attack on Ukraine 33 civilians killed at bus stop
  • ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడి
  • తూర్పు ఉక్రెయిన్‌లోని క్రమటోస్క్ బస్టాప్‌పై బాంబుల వర్షం
  • ఘటనలో 33 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన వైనం
  • ఈ ఏడాదిలో ఇదే అతి పెద్ద సింగిల్ అటాక్
  • ప్రతీకారం తీర్చుకుంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హెచ్చరిక
ఉక్రెయిన్‌పై రష్యా మరోమారు క్షిపణి దాడులతో విరుచుకుపడింది. తూర్పు ఉక్రెయిన్‌లోని క్రమటోస్క్ పట్టణంలో రద్దీగా ఉన్న ఒక బస్టాప్‌పై జరిగిన రాకెట్ దాడిలో 33 మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడగా, ఈ ఘోర దుర్ఘటనతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది.

ఈ దాడి ధాటికి బస్టాప్ పరిసరాలన్నీ రక్తసిక్తమయ్యాయి. మృతదేహాలు, శిథిలాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించాయి. ఈ ఏడాదిలో రష్యా జరిపిన దాడుల్లో పౌరులు ఇంత పెద్ద సంఖ్యలో మరణించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఈ దాడిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ తీవ్రంగా స్పందించారు. రష్యా ఉద్దేశపూర్వకంగానే పౌరులను లక్ష్యంగా చేసుకుని ఈ ఘాతుకానికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. "ఇది ముమ్మాటికీ ఉగ్రవాద చర్య. దీనికి తగిన ప్రతీకారం తీర్చుకుంటాం" అని ఆయన హెచ్చరించారు. అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంటున్న రష్యాపై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఘటనతో ఇరు దేశాల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు మరింత తీవ్రస్థాయికి చేరాయి.
Advertisement
Russia
Ukraine
Kramatorsk rocket attack
Volodymyr Zelenskyy
Russia Ukraine war
Civilian casualties Ukraine

More Telugu News