దసరాకు 7,000 ప్రత్యేక బస్సులు.. 30 మంది ఉంటే ఇంటికే వచ్చి పికప్: టీజీఎస్ఆర్టీసీ
Add ap7am to your home Screen

దసరాకు 7,000 ప్రత్యేక బస్సులు.. 30 మంది ఉంటే ఇంటికే వచ్చి పికప్: టీజీఎస్ఆర్టీసీ

TGSRTC to run 7000 special buses for Dasara with doorstep pickup service
  • రాష్ట్రంలోని వివిధ జోన్ల నుంచి వేల సంఖ్యలో సర్వీసుల ఏర్పాటు
  • ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సవరించిన టికెట్ ధరలు అమలు
  • అక్టోబర్ 9, 10, 16, 17 తేదీల్లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే అవకాశం
దసరా పండుగను పురస్కరించుకుని ప్రయాణికులు తమ స్వగ్రామాలకు సురక్షితంగా, సౌకర్యవంతంగా చేరుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) భారీ ఏర్పాట్లు చేసింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7,000 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు బుధవారం ప్రకటించింది.

సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, కరీంనగర్ జోన్ పరిధిలో అత్యధికంగా 3,533 బస్సులు (ఆదిలాబాద్ 431, నిజామాబాద్ 719, కరీంనగర్ 1,175, వరంగల్ 530, ఖమ్మం 678) నడపనున్నారు. హైదరాబాద్ జోన్ నుంచి 2,155 బస్సులు (మహబూబ్‌నగర్ 645, మెదక్ 255, నల్గొండ 815, రంగారెడ్డి 440), గ్రేటర్ హైదరాబాద్ జోన్ నుంచి 1,312 ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అక్టోబర్ 9, 10, 16, 17 తేదీల్లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుందని అంచనా వేస్తుండగా, తిరుగు ప్రయాణాల కోసం అక్టోబర్ 25, 26 తేదీల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఈ ఏడాది ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ ఒక నూతన సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కాలనీలు, టౌన్‌షిప్‌లు, గేటెడ్ కమ్యూనిటీలు, హాస్టళ్లు, కళాశాలల నుంచి కనీసం 30 మంది ప్రయాణికులు ఒక బృందంగా ఏర్పడి ముందస్తుగా బుక్ చేసుకుంటే, వారి వద్దకే బస్సును పంపి పికప్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ ప్రత్యేక బస్సు సర్వీసులకు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం టికెట్ ధరలను సవరించినట్లు టీజీఎస్ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
Advertisement
TGSRTC
Dasara special buses
Telangana transport news
TGSRTC group pickup service
Hyderabad special buses

More Telugu News