సీడబ్ల్యూసీ సమావేశానికి ముందు.. రేవంత్, డీకే శివకుమార్ లతో రాహుల్ ముచ్చట్లు
Advertisement

సీడబ్ల్యూసీ సమావేశానికి ముందు.. రేవంత్, డీకే శివకుమార్ లతో రాహుల్ ముచ్చట్లు

Revanth Reddy and DK Shivakumar chat with Rahul Gandhi before CWC meeting
  • సీడబ్ల్యూసీ సమావేశానికి ముందు ప్రాంగణంలో ముచ్చట్లు
  • రాహుల్ గాంధీతో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్
  • ఆరు బయట నలుగురు మాట్లాడుకుంటున్న ఫొటోను షేర్ చేసిన రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి ముందు, ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయ ప్రాంగణంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ లతో కొద్దిసేపు ముచ్చటించారు.

సీడబ్ల్యూసీ సమావేశానికి ముందు వారు నిలుచుని ముచ్చటించుకుంటున్నట్లుగా ఉన్న ఫొటోను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సామాజిక మాధ్యమ ఖాతాలో పంచుకున్నారు. ఈ సంభాషణలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, శివకుమార్‌తో పాటు కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు.

కాగా, సీడబ్ల్యూసీ సమావేశంలో పలు జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలపై చర్చించినట్లు రేవంత్ రెడ్డి తన పోస్టులో పేర్కొన్నారు. దేశ భవిష్యత్తుకు సంబంధించిన సామాజిక, ఆర్థిక వ్యూహాలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. అదే సమయంలో, భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ఎన్నికల సంఘం కలిసి ఎన్నికల ప్రక్రియ సమగ్రతను దెబ్బతీస్తున్నాయన్న ఆరోపణలపైనా ఈ భేటీలో చర్చ జరిగినట్లు ఆయన వెల్లడించారు.
Advertisement
Revanth Reddy
Rahul Gandhi
DK Shivakumar
CWC meeting Delhi
Congress Working Committee
KC Venugopal

More Telugu News