ప్రయాణికులకు అలర్ట్! అక్టోబర్ నెలలో రైల్లో ప్రయాణిస్తే ఈ పత్రాలు తప్పనిసరి!
- అక్టోబర్ 1 నుంచి 31 వరకు రైల్వే స్పెషల్ టికెట్ తనిఖీ డ్రైవ్
- రాయితీ, కోటా, గ్రూప్ టికెట్లపై ప్రత్యేకంగా దృష్టి
- ప్రయాణ సమయంలో ఒరిజినల్ ఐడీ కార్డు తప్పనిసరి
- సరైన పత్రాలు లేకుంటే కనీస జరిమానా రూ.500
రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక. అక్రమ, అనధికార ప్రయాణాలకు అడ్డుకట్ట వేసేందుకు సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి 31వ తేదీ వరకు నెల రోజుల పాటు ప్రత్యేక టికెట్ తనిఖీ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ తనిఖీలు రైల్వే స్టేషన్లతో పాటు లోకల్ రైళ్లలోనూ విస్తృతంగా కొనసాగనున్నాయి.
ఈ ప్రత్యేక తనిఖీల్లో భాగంగా రాయితీ టికెట్లు, నిర్దేశిత రిజర్వేషన్ కోటాలు, రైల్వే పాస్‌లు (ఈ-పాస్, పీటీవో), గ్రూప్ బుకింగ్‌లు, అన్‌రిజర్వ్‌డ్ టికెట్లపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించనున్నారు. తనిఖీ సిబ్బంది 'టీటీఈ యాప్' ద్వారా కూడా టికెట్ల ప్రామాణికతను క్షుణ్ణంగా పరిశీలిస్తారు.
రాయితీ లేదా ప్రత్యేక కోటాల కింద ప్రయాణించే వారు తప్పనిసరిగా ఒరిజినల్ గుర్తింపు కార్డును తమ వెంట ఉంచుకోవాలని రైల్వే స్పష్టం చేసింది. గుర్తింపు కార్డుల జిరాక్స్ కాపీలు లేదా మొబైల్ ఫోన్‌లోని ఫోటోలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తేల్చిచెప్పింది. ప్రయాణికులు తమ వెంట ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ లేదా ప్రభుత్వం జారీ చేసిన ఇతర గుర్తింపు కార్డులను చూపించవచ్చు. గ్రూప్ రిజర్వేషన్ చేసుకున్న సందర్భంలో, టికెట్‌పై పేరు ఉన్న ప్రయాణికులలో కనీసం ఒక్కరైనా ఒరిజినల్ ఐడీ కార్డును చూపించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో, గ్రూప్‌లోని ప్రయాణికులందరినీ టికెట్ లేని వారిగానే పరిగణిస్తారు.
తనిఖీల సమయంలో సరైన పత్రాలు చూపించలేకపోయినా, టికెట్ అర్హతను నిరూపించుకోలేకపోయినా రైల్వే నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటారు. టికెట్ లేకుండా ప్రయాణించినందుకు విధించే కనీస జరిమానాను ఇటీవల రూ. 250 నుంచి రూ. 500కి పెంచినట్లు రైల్వే గుర్తు చేసింది. ప్రయాణికులు నిబంధనలు పాటించి, తనిఖీ సిబ్బందికి సహకరించి తమ ప్రయాణాన్ని సులభతరం చేసుకోవాలని సెంట్రల్ రైల్వే విజ్ఞప్తి చేసింది.