జీవితాంతం నీవు నా దగ్గరే ఉంటావు: విజయ్ దేవరకొండ

జీవితాంతం నీవు నా దగ్గరే ఉంటావు: విజయ్ దేవరకొండ

Vijay Deverakonda says you will be with me for the rest of my life
  • విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'రణబాలి'
  • విజయ్ పై ఏమాత్రం క్రష్ తగ్గలేదన్న రష్మిక
  • అంతే ప్రేమతో సమాధానమిచ్చిన విజయ్ దేవరకొండ

రియల్ లైఫ్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ సినీ అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ‘సింగనమల బొబ్బిలి రణబాలి’గా పవర్‌ఫుల్ పాత్రలో అలరించనుండగా, ఆయనకు జోడీగా రష్మిక ‘జయమ్మ’ పాత్రలో నటిస్తోంది. ఇటీవల విడుదలైన ‘ఏందయ్యా సామీ..’ పాట యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియా వేదికగా విశేష ప్రజాదరణ పొందుతోంది. 

  

తాజాగా, ఈ పాటలోని ఒక రొమాంటిక్ క్లిప్‌ను రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ... అతను పూర్తిగా తనకే సొంతమయ్యాడని, కానీ అతనిపై ఉన్న క్రష్ మాత్రం ఏమాత్రం తగ్గలేదని కామెంట్ చేసింది. దీనికి విజయ్ దేవరకొండ రిప్లై ఇస్తూ... "నేను ఎంతో అదృష్టవంతుడిని. నేను జయమ్మని మిస్ అవుతాను కానీ.. జీవితాంతం నువ్వు నా దగ్గరే ఉంటావు" అని ఎంతో ప్రేమగా స్పందించాడు. ఈ సరదా సంభాషణ మరియు వారి మధ్య ఉన్న అనుబంధం చూసి అభిమానులు మురిసిపోతున్నారు.


మరోవైపు, ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తుండగా... మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Advertisement
Vijay Deverakonda
Rashmika Mandanna
Ranabali movie
Rahul Sankrityan
Mythri Movie Makers
Endayya Saami song

More Telugu News