నాకు ఇది పునర్జన్మ.. దయచేసి హెల్మెట్ పెట్టుకోండి: సాయి దుర్గ తేజ్ ఎమోషనల్ పోస్ట్!
- బైక్ ప్రమాదం జరిగి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా సాయి తేజ్ భావోద్వేగ పోస్ట్
- ప్రమాదం జరిగిన రోజును తన 'పునర్జన్మ దినం'గా అభివర్ణించిన మెగా హీరో
- అభిమానుల ప్రార్థనల వల్లే బతికానని, 90 శాతం కోలుకున్నానని వెల్లడి
- ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అభిమానులకు విజ్ఞప్తి
- వచ్చే ఏడాది జనవరి 12న 'సంబరాల ఏటి గట్టు' సినిమాతో రానున్న తేజ్
టాలీవుడ్ నటుడు సాయి దుర్గ తేజ్ ఐదేళ్ల క్రితం తాను ఎదుర్కొన్న ఘోర రోడ్డు ప్రమాదాన్ని గుర్తుచేసుకుంటూ నేడు ఓ భావోద్వేగ ప్రకటన విడుదల చేశారు. ప్రమాదం జరిగిన రోజును తన 'పునర్జన్మ దినం'గా పేర్కొంటూ, హెల్మెట్ పెట్టుకోవడం అనే ఒక్క చిన్న నిర్ణయం వల్లే తాను ఈ రోజు బతికున్నానని తెలిపారు. అభిమానులందరూ తప్పకుండా హెల్మెట్ ధరించాలని ఆయన మనస్ఫూర్తిగా కోరారు.
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో 'పునర్జన్మ-దినం' పేరుతో ఆయన విడుదల చేసిన ప్రకటనలో.. "నా కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు, ప్రతి సినీ ప్రేమికుడికి.. సరిగ్గా ఐదేళ్ల క్రితం మీ ప్రార్థనలు, ప్రేమ, బేషరతు మద్దతుతో నాకు రెండో జీవితం లభించింది. గాయాల నుంచి నేను 90% కోలుకున్నాను. ఇంకా నా మాటలో, మరికొన్ని ఇతర సవాళ్లలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. కానీ వాటిని అధిగమిస్తున్నాను. ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నాను" అని పేర్కొన్నారు.
"మీ ప్రేమ నన్ను ఎప్పుడూ వీడలేదు. ప్రతీ కష్టమైన రోజు, ఎదురైన ప్రతీ ఎదురుదెబ్బ, వదిలేయడం సులభం అనిపించిన ప్రతి క్షణంలోనూ నాకు అండగా నిలిచి బలాన్నిచ్చింది. ఐదేళ్ల తర్వాత ఇక్కడ ఉన్నాను. ఇంకా నిలబడి ఉన్నాను. పోరాడుతూనే ఉన్నాను. జీవిస్తూనే ఉన్నాను. మీ ప్రార్థనలకు, శుభాకాంక్షలకు, సందేశాలకు, మీరు చూపిన ప్రేమకు ధన్యవాదాలు. మీరు లేకుండా నేను ఇక్కడ ఉండేవాడిని కాదు" అని ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తన కథ నుంచి అభిమానులు ఒక ముఖ్యమైన విషయం నేర్చుకోవాలని ఆయన కోరారు. "దయచేసి హెల్మెట్ పెట్టుకోండి. ఆ ఒక్క చిన్న నిర్ణయమే నేను ఈ రోజు ఇక్కడ ఉండటానికి కారణం" అని తన ప్రకటనలో రాసుకొచ్చారు.
సాయి దుర్గ తేజ్ 2021 సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. స్పోర్ట్స్ బైక్‌పై వెళుతుండగా అదుపుతప్పి కిందపడటంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించగా, వైద్యులు సకాలంలో చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు.
ఇక, సినిమాల విషయానికొస్తే.. సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం దర్శకుడు రోహిత్ కేపీ రూపొందిస్తున్న పాన్-ఇండియన్ చిత్రం 'సంబరాల ఏటి గట్టు'లో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.