హైదరాబాదులో ఘనంగా షర్మిల కుమార్తె నిశ్చితార్థం.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
- షర్మిల ఇంట మొదలైన పెళ్లిసందడి
- అంజలి వెడ్స్ రఘు
- హైదరాబాద్ శివారులోని కొత్వాల్‌గూడలో నేడు నిశ్చితార్థం
- సతీసమేతంగా హాజరైన రేవంత్ రెడ్డి
- కాబోయే వధూవరులకు ఆశీస్సులు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆమె కుమార్తె అంజిలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డిల నిశ్చితార్థ వేడుక గురువారం హైదరాబాద్ శివారులోని కొత్వాల్‌గూడలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాబోయే వధూవరులను ఆయన ఆశీర్వదించారు.
ఈ నిశ్చితార్థ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా పలువురు రాజకీయ ప్రముఖులు, కుటుంబ సభ్యులు, ఆత్మీయులు పాల్గొన్నారు. నూతన జంటకు వారు శుభాకాంక్షలు తెలియజేశారు. కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక వైభవంగా జరిగింది.
కాగా, తన కుమార్తె వివాహానికి సంబంధించిన కీలక తేదీలను షర్మిల కొద్ది రోజుల క్రితమే స్వయంగా ప్రకటించారు. సెప్టెంబర్ 24న నిశ్చితార్థం, నవంబర్ 25న వివాహం, డిసెంబర్ 5న రిసెప్షన్ ఉంటుందని ఆమె ఎక్స్ వేదికగా వెల్లడించారు. వివాహ వేడుకకు సంబంధించిన మొదటి ఆహ్వాన పత్రికను ఇడుపులపాయలోని తన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ క్రమంలో, వివాహ ఆహ్వానం కోసం తన సోదరుడు వైఎస్ జగన్‌ను కలవడంపై వస్తున్న రాజకీయ ఊహాగానాలను షర్మిల ఖండించారు. తన కుమార్తె వివాహానికి అన్ని రాజకీయ పార్టీల అధినేతలను ఆహ్వానిస్తానని, ఇందులో ఎలాంటి రాజకీయ కోణాలు చూడవద్దని ఆమె స్పష్టం చేశారు.