నవంబర్‌లో విశాఖ సదస్సు.. దేశ, విదేశాల్లో ఏపీ ప్రభుత్వ రోడ్‌షోలు.. సీఎం చంద్రబాబు కొత్త వ్యూహం
- విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సు-2026పై సీఎం చంద్రబాబు సమీక్ష
- సదస్సుకు ముందు 5 ప్రాంతాల్లో రీజనల్ కాన్ఫరెన్సులు నిర్వహించాలని ఆదేశం
- ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యతనిస్తూ 30 నియోజకవర్గాల్లో పార్కులకు శంకుస్థాపన
- పాత ఎంవోయూలను వేగంగా కార్యరూపం దాల్చాలని అధికారులకు సీఎం నిర్దేశం
- సదస్సు ప్రచారానికి దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో భారీగా రోడ్‌షోల నిర్వహణ
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా, పారిశ్రామికవేత్తల్లో నూతనోత్సాహం నింపేలా విశాఖపట్నంలో నిర్వహించనున్న ‘సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026’ను ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ సదస్సు కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను ప్రపంచానికి చాటిచెప్పేలా ఉండాలని స్పష్టం చేశారు. నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖలో జరగనున్న ఈ సదస్సు సన్నాహకాలపై గురువారం సచివాలయంలో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సదస్సుకు ముందు రాష్ట్రంలోని ఐదు కీలక ప్రాంతాల్లో రీజినల్ కాన్ఫరెన్సులు నిర్వహించి, స్థానిక ప్రత్యేకతలకు అనుగుణంగా పెట్టుబడులను ఆకర్షించాలని దిశానిర్దేశం చేశారు.
ఎంఎస్ఎంఈలకు పెద్దపీట.. వినూత్న కార్యక్రమాలు
ఈసారి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇందులో భాగంగా, భాగస్వామ్య సదస్సుకు ముందే రాష్ట్రంలోని 30 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపనలు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి రీజినల్ కాన్ఫరెన్స్‌లో 'ఎంఎస్ఎంఈ షోకేస్' ఏర్పాటు చేసి వారి ఉత్పత్తులను ప్రదర్శించాలని, స్టార్టప్‌లకు పెట్టుబడులు సమకూర్చేందుకు 'షార్క్ ట్యాంక్' తరహా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాలని వినూత్న సూచన చేశారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లను ఈ ప్రాంతీయ సదస్సులకు అనుసంధానించాలని చెప్పారు.
విద్యార్థి దశ నుంచే పారిశ్రామిక స్ఫూర్తిని నింపేందుకు 7వ తరగతి నుంచే పాఠ్యాంశాల్లో ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను చేర్చాలని, 'ఇన్వెస్ట్ కడప' తరహా కార్యక్రమాలను అన్ని జిల్లాల్లో నిర్వహించాలని ఆదేశించారు.
పాత ఒప్పందాల వేగవంతంపై దృష్టి
సమీక్ష సందర్భంగా, గతంలో కుదిరిన ఒప్పందాలను (ఎంవోయూ) వేగంగా కార్యరూపంలోకి తీసుకురావడంపై సీఎం ప్రధానంగా దృష్టి సారించారు. 2024 జూన్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.22.57 లక్షల కోట్ల విలువైన 714 ప్రాజెక్టులకు ఎంవోయూలు కుదిరాయని అధికారులు వివరించారు. వీటిలో రూ.16.6 లక్షల కోట్ల విలువైన 473 ప్రాజెక్టులు కన్వర్ట్ అయ్యాయని, 247 ప్రాజెక్టుల పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని (గ్రౌండింగ్) తెలిపారు. అక్టోబర్ చివరి నాటికి పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనల్లో 80 శాతం కన్వర్ట్ చేయాలని, కన్వర్ట్ అయిన వాటిలో 75 శాతం ప్రాజెక్టుల పనులు ప్రారంభించేలా పనిచేయాలని లక్ష్యంగా నిర్దేశించారు.
రీజినల్ కాన్ఫరెన్స్‌ల షెడ్యూల్ ఖరారు
రాష్ట్రంలోని ఐదు నగరాల్లో అక్టోబర్ 7 నుంచి 26 వరకు రీజినల్ కాన్ఫరెన్సులు జరగనున్నాయి.
అక్టోబర్ 7 (విశాఖపట్నం): ఏఐ, డేటా సెంటర్లు, ఐటీ, ఫార్మా, మెడ్‌టెక్.
అక్టోబర్ 12 (కాకినాడ): మారిటైమ్, షిప్ బిల్డింగ్, గ్రీన్ హైడ్రోజన్, ఆక్వా ఎగుమతులు.
అక్టోబర్ 16 (గుంటూరు): గవర్నెన్స్, రాజధాని నిర్మాణం, క్వాంటం వ్యాలీ, అర్బన్ ఇన్ఫ్రా.
అక్టోబర్ 23 (అనంతపురం): ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటోమోటివ్, పునరుత్పాదక ఇంధనం.
అక్టోబర్ 26 (తిరుపతి): టూరిజం, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్, స్పేస్ టెక్నాలజీ.
ఈ ప్రాంతీయ సదస్సుల్లోనే చాలా వరకు ఎంవోయూలు పూర్తవుతాయని, ప్రధాన సదస్సులో మాత్రం కీలక ప్రాజెక్టులు, ఉన్నత స్థాయి చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రచారం.. భారీగా రోడ్‌షోలు
‘ట్రేడ్, టెక్నాలజీ, ట్రస్ట్, థాట్ లీడర్షిప్’ అనే థీమ్‌తో జరగనున్న ఈ సదస్సుకు అంతర్జాతీయంగా ప్రచారం కల్పించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. దేశీయంగా చెన్నై, బెంగళూరులో రోడ్‌షోలు పూర్తి కాగా, త్వరలో అహ్మదాబాద్, హైదరాబాద్, ముంబైలో నిర్వహించనున్నారు. సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్లలో అంతర్జాతీయ రోడ్‌షోలు పూర్తయ్యాయి. స్వీడన్, జపాన్, చైనాలోనూ త్వరలో జరగనున్నాయి. ఈ సదస్సుకు 11 మంది అంతర్జాతీయ మంత్రులు, 21 దేశాల ప్రతినిధులు ఇప్పటికే తమ షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. అక్టోబర్ 8న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో కర్టెన్ రైజర్ కార్యక్రమం నిర్వహించనున్నారు.
మరోవైపు, కాపులుప్పాడలో నిర్మించే కన్వెన్షన్ సెంటర్‌ను బహుళ ప్రయోజనాలకు అనువుగా తీర్చిదిద్దాలని, రాజమండ్రిలోని సెంటర్‌ను గోదావరి పుష్కరాల నాటికి పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు.