పాపం నఖ్వీ.. ఇంతకంటే అవమానం ఏం ఉంటుంది చెప్పండి.. వైరల్ వీడియో!
- ఆసియా కప్‌ను రికార్డు స్థాయిలో 8వ సారి గెలిచిన భారత మహిళల జట్టు
- ఏసీసీ ఛైర్మన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు నిరాకరణ
- గతేడాది పురుషుల జట్టు కూడా ఇదే విధంగా వ్యవహరించిన వైనం
- 'ట్రోఫీ చోర్' అంటూ నఖ్వీకి వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఇండియన్ ఫ్యాన్స్
- వివాదంతో ప్రస్తుతం ఏసీసీ కార్యాలయంలోనే ఆసియా కప్ ట్రోఫీ
ఆసియా కప్‌లో భారత క్రికెట్ ఆధిపత్యం కొనసాగినా, ట్రోఫీ స్వీకరణ వివాదం మాత్రం వరుసగా రెండో ఏడాది కూడా ముగియలేదు. దుబాయ్‌లో ఆదివారం జరిగిన మహిళల ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంకపై ఘన విజయం సాధించిన భారత జట్టు, ట్రోఫీని స్వీకరించేందుకు నిరాకరించింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఛైర్మన్‌గా ఉన్న పాకిస్థాన్‌కు చెందిన మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా కప్ అందుకునేందుకు ఇష్టపడని క్రీడాకారిణులు, ప్రజెంటేషన్ కార్యక్రమానికి మైదానంలోకి రాలేదు.
దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ తుది పోరులో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు 72 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసి రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. అయితే, మ్యాచ్ అనంతరం జరిగిన బహుమతుల ప్రదానోత్సవానికి భారత జట్టు దూరంగా ఉంది. ఇదే సమయంలో స్టేడియంలోని అభిమానులు నఖ్వీని ఉద్దేశిస్తూ 'ట్రోఫీ చోర్' (ట్రోఫీ దొంగ) అంటూ నినాదాలు చేయడం అతనికి మరింత అవమానకరంగా మారింది.
గత ఏడాది జరిగిన పురుషుల ఆసియా కప్ సమయంలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. అప్పుడు కూడా భారత జట్టు నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ, పతకాలు స్వీకరించేందుకు నిరాకరించింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్‌గా, ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిగా కూడా నఖ్వీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
భారత జట్టు తిరస్కరించడంతో ప్రస్తుతం ఆసియా కప్ ట్రోఫీ ఏసీసీ కార్యాలయంలోనే ఉంది. బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా జట్టు అంతర్గతంగా బెస్ట్ ఫీల్డర్ మెడల్‌ను నందిని శర్మకు అందించిన తర్వాత కూడా, జట్టు సభ్యులు తిరిగి మైదానంలోకి రాకపోవడం గమనార్హం.