నా ఫ్యామిలీ, నా ఇష్టం.. వైరల్ అవుతున్న ఐశ్వర్య రాయ్ మాటలు
- తల్లిదండ్రులతో కలిసి ఉండటంపై ఐశ్వర్య రాయ్ పాత ఇంటర్వ్యూ వైరల్
- అమెరికాలో యువత ఇల్లు విడిచి వెళ్లడంపై ఆసక్తికర వ్యాఖ్యలు
- పని ఒత్తిడి వల్ల కుటుంబంతో గడిపే సమయం చాలా తక్కువన్న ఐష్
- ఇల్లు వదిలి వెళ్లడమే స్వాతంత్య్రానికి నిదర్శనం కాదని వ్యాఖ్య
ప్రపంచ మాజీ సుందరి, ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కు సంబంధించిన ఒక పాత ఇంటర్వ్యూ క్లిప్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కెరీర్‌లో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, తల్లిదండ్రులతోనే కలిసి నివసించడంపై ఆమె చేసిన వ్యాఖ్యలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పాశ్చాత్య సంస్కృతికి, భారతీయ జీవన విధానానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ వీడియోలో ఆమె స్పష్టంగా వివరించారు.
అమెరికాలో యువత యుక్త వయసు రాగానే తల్లిదండ్రులను విడిచి సొంతంగా నివసించడంపై ఐశ్వర్య ఆ ఇంటర్వ్యూలో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. "అక్కడ అది ఒక సామాజిక నియమమా? అందరూ తప్పనిసరిగా ఇల్లు విడిచి వెళ్లిపోవాలా? ఎందుకో అది నాకు అర్థం కావడం లేదు" అని ఆమె ప్రశ్నించారు.
ముప్పై ఏళ్లు పైబడిన విజయవంతమైన అమెరికన్ మహిళలు సాధారణంగా తల్లిదండ్రులతో కలిసి ఉండరని ప్రస్తావించినప్పుడు, ఐశ్వర్య తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. "వృత్తిరీత్యా నేను నిరంతరం ప్రయాణాలు చేస్తుంటాను. దీంతో కుటుంబంతో గడిపే సమయం చాలా తక్కువగా ఉంటుంది. అరుదుగా లభించే ఆ కలిసి భోజనం చేసే సమయాన్ని మేము ఎంతో విలువైనదిగా భావిస్తాం" అని ఆమె తెలిపారు.
తాను పూర్తి స్వతంత్రురాలినని పేర్కొంటూనే.. "తల్లిదండ్రులకు దూరంగా వెళ్లిపోవడమే స్వేచ్ఛకు నిదర్శనమని నేను భావించడం లేదు" అని ఆమె స్పష్టం చేశారు. 1994లో 'మిస్ వరల్డ్' కిరీటం గెలుచుకున్న ఐశ్వర్య రాయ్, తమిళ చిత్రం 'ఇరువర్' (తెలుగులో 'ఇద్దరు')తో సినీ రంగ ప్రవేశం చేశారు. అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకున్న ఆమె, ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో క్రమం తప్పకుండా పాల్గొంటూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.