చిరంజీవి కుమార్తె సుస్మితకు కీలక పదవి.. దుర్గమ్మ ఆలయ బోర్డులో చోటు
- విజయవాడ దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియామకం
- ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలపై సలహాలు ఇవ్వనున్న సుస్మిత
- తెలంగాణ యాదాద్రి బోర్డులో సభ్యురాలిగా కొనసాగుతున్న చిరంజీవి అర్ధాంగి సురేఖ
మెగాస్టార్ చిరంజీవి కుమార్తె, సినీ నిర్మాత కొణిదెల సుస్మితకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు లభించాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారి ఆలయ ట్రస్ట్ బోర్డులో ఆమెను ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నియామకంతో సుస్మిత ఇకపై దుర్గమ్మ ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామి కానున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు కల్పిస్తున్న వసతులు, ఆలయంలో చేపట్టే అభివృద్ధి పనులు, దసరా నవరాత్రులు వంటి ప్రత్యేక ఉత్సవాల నిర్వహణపై ఆమె ట్రస్ట్ బోర్డుకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు.
సుస్మిత కొణిదెల 'గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్' బ్యానర్‌పై చిత్రాలను నిర్మిస్తూ నిర్మాతగా రాణిస్తున్నారు. ఇటీవల తన తండ్రి చిరంజీవితో నిర్మించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంతో ఆమె మంచి విజయాన్ని అందుకున్నారు. ఆసక్తికరంగా సుస్మిత తల్లి కొణిదెల సురేఖ తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు సుస్మితకు కూడా ఏపీలోని ప్రముఖ ఆలయ బోర్డులో స్థానం లభించడం విశేషం.