టీవీలు రహస్యంగా మన ఇంటి గుట్టును రికార్డ్ చేస్తున్నాయా? ఎల్‌జీపై షాకింగ్ సెక్యూరిటీ రిపోర్ట్!
- ఎల్‌జీ టీవీలపై కొత్త ప్రైవసీ ఆందోళనలు
- ఇంటి నెట్‌వర్క్‌లోని పరికరాలను గుర్తించే సామర్థ్యం
- స్టాండ్‌బైలో ఆడియో క్యాప్చర్ పరీక్ష
- ఏసీఆర్ ద్వారా సమాచారం సేకరణ
- టీవీల్లో భద్రతా లోపాలపై పరిశోధకుల హెచ్చరిక
ఇంట్లో టీవీ ఆఫ్ చేశాం.. ఇక స్క్రీన్ క్లోజ్ అయింది అనుకుంటున్నారా? అయితే ఓసారి ఆలోచించాల్సిందే. ఎల్‌జీ స్మార్ట్ టీవీలకు సంబంధించి తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ భద్రతా పరిశోధన ఆశ్చర్యం కలిగిస్తోంది. గేమర్స్ నెక్సస్, లెవెల్1టెక్స్, స్వతంత్ర సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు కలిసి చేసిన పరీక్షల్లో కొన్ని ఎల్‌జీ టీవీలు స్క్రీన్ స్టాండ్‌బైలో ఉన్నప్పటికీ మైక్రోఫోన్ ఆడియోను క్యాప్చర్ చేయగలవని గుర్తించారు. అదే సమయంలో ఇంటి వై-ఫై నెట్‌వర్క్‌లో ఉన్న ఇతర పరికరాలను కూడా గుర్తిస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు.
పరిశోధకులను ఉటంకిస్తూ 'ఇండియా టుడే' కథనం ప్రకారం.. ఎల్‌జీ టీవీలు ఒకే నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయిన ఫోన్లు, కంప్యూటర్లు, ప్రింటర్లు, స్మార్ట్ హోమ్ పరికరాలను గుర్తించగలవు. సమీపంలోని ఇతర వై-ఫై నెట్‌వర్క్‌ల పేర్లు, సిగ్నల్ వివరాలను కూడా సేకరించే సామర్థ్యం ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. ఈ సమాచారం ఏసీఆర్ (ఆటోమేటెడ్ కంటెంట్ రికగ్నిషన్), అడ్వర్టైజింగ్ ఐడీలతో కలిస్తే.. ఇంట్లో ఎలాంటి పరికరాలు ఉన్నాయి? ఏ కంటెంట్ చూస్తున్నారు? వంటి వివరాలతో వినియోగదారుల ప్రొఫైల్ రూపొందించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏసీఆర్ అంటే ఏంటి?
స్మార్ట్ టీవీల్లో ఉండే ఆటోమేటెడ్ కంటెంట్ రికగ్నిషన్ (ఏసీఆర్) ఫీచర్ స్క్రీన్‌పై ప్లే అవుతున్న కంటెంట్‌ను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. ప్రోగ్రామ్స్, ప్రకటనలు వంటి వాటిని గుర్తించి వాటి ఆధారంగా వీక్షణ అలవాట్లపై సమాచారం సేకరించవచ్చు. ఎల్‌జీ టీవీల్లో ఈ డేటాను ఇతర పరికరాలు, అడ్వర్టైజింగ్ ఐడీల సమాచారంతో కలిపి ఉపయోగించే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
అయితే ఎల్‌జీ టీవీలు ప్రతి ఇంట్లోనూ రహస్యంగా సంభాషణలను రికార్డు చేస్తున్నాయని దీని అర్థం కాదు. పరిశోధకులు చూపించిన ఆడియో క్యాప్చర్ ఒక టీవీపై జరిగిన పరీక్షకు సంబంధించినది. స్టాండ్‌బైలో ఉన్న టీవీ మైక్రోఫోన్ ద్వారా ఆడియోను క్యాప్చర్ చేసి స్థానికంగా స్టోర్ చేయగలదని వారు చూపించారు. ఇంటర్నెట్ కనెక్షన్ తిరిగి వచ్చినప్పుడు ఆ డేటాను పంపే అవకాశం కూడా పరీక్షలో కనిపించింది.
ఇక పరిశోధకులు ఎల్‌జీకి కొన్ని రిమోట్-కోడ్-ఎగ్జిక్యూషన్ భద్రతా లోపాలను కూడా తెలియజేశారు. వాటి పూర్తి సాంకేతిక వివరాలను ఇంకా బహిర్గతం చేయలేదు. ఒక టీవీ హ్యాక్‌కు గురైతే.. అది కేవలం ప్రైవసీ సమస్యగా కాకుండా ఇంటి నెట్‌వర్క్‌లోకి చొరబడేందుకు మార్గంగా మారే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
ఎల్‌జీ టీవీ వినియోగదారులు తమ టీవీలోని ప్రైవసీ సెటింగ్స్‌ను చెక్ చేసుకోవడం మంచిది. అవసరం లేని ఏసీఆర్, వ్యూయింగ్ ఇన్ఫర్మేషన్ కలెక్షన్, పర్సనలైజ్డ్ అడ్వర్టైజింగ్, వాయిస్ రికగ్నిషన్ వంటి ఫీచర్లను ఆఫ్ చేయాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. టీవీని ప్రత్యేక గెస్ట్/ఐఓటీ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయడం, అవసరం లేకపోతే రూటర్‌లో UPnPను డిసేబుల్ చేయడం కూడా అదనపు రక్షణ ఇవ్వొచ్చు.