నా కొడుకుని చూసి చాలా గర్విస్తున్నా: సీఎం విజయ్ తండ్రి చంద్రశేఖర్

నా కొడుకుని చూసి చాలా గర్విస్తున్నా: సీఎం విజయ్ తండ్రి చంద్రశేఖర్

Vijay Father Chandrasekhar Says I Am Very Proud Of My Son
  • మహిళల గౌరవంపై విజయ్ తీసుకున్న నిర్ణయాలు సంతోషాన్ని ఇచ్చాయన్న చంద్రశేఖర్
  • ప్రత్యర్థి పార్టీల చవకబారు ఆరోపణలను ప్రజలు నమ్మరని వ్యాఖ్య
  • ప్రతిపక్షాల విమర్శలను విజయ్ తిప్పికొట్టిన తీరు సంతోషాన్ని ఇచ్చిందని వెల్లడి

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చుట్టూ తిరుగుతున్న రాజకీయ, వ్యక్తిగత వివాదాల వేళ విజయ్ తండ్రి, సీనియర్ దర్శకుడు ఎస్‌.ఏ. చంద్రశేఖర్ చేసిన తాజా వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల జరిగిన పలు రాజకీయ పరిణామాలు, అసెంబ్లీ వ్యాఖ్యల అనంతరం మాట్లాడిన ఆయన... తన కొడుకుని చూసి తాను ఎంతో గర్వపడుతున్నాను అంటూ కుమారుడికి పూర్తి మద్దతుగా సంచలన ప్రకటన చేశారు.

  

గతంలో విజయ్‌తో ఉన్న విభేదాలు, వ్యక్తిగత వివాదాల వల్ల దూరంగా ఉంటున్నారనే ప్రచారానికి చెక్ పెడుతూ, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆయన విజయ్ వైఖరిని గట్టిగా సమర్థించారు. మహిళల గౌరవం, రాజకీయ మర్యాదలపై సభలో విజయ్ తీసుకున్న స్పష్టమైన నిర్ణయాలు, ప్రతిపక్ష విమర్శలను తిప్పికొట్టిన తీరు పట్ల ఒక తండ్రిగా తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయని పేర్కొన్నారు. 

 

తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న చవకబారు ఆరోపణలను ప్రజలు నమ్మరని, కొడుకు విజయాన్ని, పట్టుదలను చూసి గర్విస్తున్నానని ఎస్‌.ఏ. చంద్రశేఖర్ స్పష్టం చేశారు. తండ్రి నుంచి వచ్చిన ఈ బహిరంగ మద్దతుతో టీవీకే వర్గాలు, విజయ్ అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం నిండింది.

Advertisement
Vijay
SA Chandrasekhar
TVK Party
Tamil Nadu Politics
Vijay Father Comments
Tamil Nadu Assembly

More Telugu News