‘భారత్ పేద దేశం కాదు.. అలా మార్చారు’.. అమెరికన్ ఆర్టిస్ట్ మాటలకు సోషల్ మీడియాలో ఫిదా!
- జైపూర్‌లో పర్యటిస్తున్న అమెరికన్ ఆర్టిస్ట్ జెమా ఫెర్రర్
- భారత చరిత్ర, సంస్కృతిపై ప్రశంసలు
- భారత్‌ను పేద దేశంగా చూపడంపై అభ్యంతరం
- యోగా, ఆయుర్వేదంతో పాశ్చాత్య ప్రపంచానికి లాభాలపై వ్యాఖ్యలు
- బ్రిటిష్ పాలనతో భారత వస్త్ర పరిశ్రమ దెబ్బతిందన్న అభిప్రాయం
‘‘భారత్ గురించి ఇంతవరకు నేను అనుకున్నదంతా తప్పు.. ఈ దేశ గొప్పతనం ఇప్పుడు అర్థమవుతోంది’’.. రాజస్థాన్‌లో పర్యటిస్తున్న అమెరికన్ టాటూ ఆర్టిస్ట్ జెమా ఫెర్రర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జైపూర్ పర్యటనలో భారత చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను దగ్గరగా గమనించిన ఆమె.. భారత్‌ను పాశ్చాత్య దేశాలు చూసే విధానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్‌ను పేదరికం, జనాభా రద్దీ, అధ్వాన జీవన పరిస్థితులతో ముడిపెట్టి విదేశీ సినిమాలు, పాప్ కల్చర్‌లో చూపిస్తుంటారని జెమా అన్నారు. అదే సమయంలో యోగా, ఆయుర్వేదం, ధ్యానం, భారతీయ వస్త్ర సంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా భారీ పరిశ్రమలుగా మారాయని గుర్తుచేశారు. భారతీయ సంస్కృతి నుంచి ప్రపంచం వాణిజ్యపరంగా ప్రయోజనం పొందుతున్నా.. వాటిని సృష్టించిన ప్రజలకు, సమాజాలకు తగిన గుర్తింపు దక్కడం లేదని ఆమె అభిప్రాయపడ్డారు.
భారత్ ఆర్థిక చరిత్రను ప్రస్తావిస్తూ బ్రిటిష్ పాలనపై కూడా జెమా కీలక వ్యాఖ్యలు చేశారు. పత్తి, మస్లిన్, పట్టు వస్త్రాల తయారీలో భారత్‌కు శతాబ్దాల చరిత్ర ఉందని చెప్పారు. ప్రపంచ మార్కెట్లలో భారతీయ వస్త్రాలకు భారీ డిమాండ్ ఉండేదని పేర్కొన్నారు. బ్రిటిష్ పాలనా విధానాలు భారత సంప్రదాయ పరిశ్రమలను దెబ్బతీశాయని.. ముఖ్యంగా చేనేత కార్మికులు, కళాకారులపై తీవ్ర ప్రభావం చూపాయని అన్నారు.
భారత్ స్వాతంత్ర్య ఉద్యమాన్ని కూడా ఆమె ప్రశంసించారు. మహాత్మా గాంధీ నాయకత్వంలో అహింసా మార్గాన్ని ఎంచుకుని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొన్న తీరు ప్రపంచ చరిత్రలో ప్రత్యేకమైనదని అన్నారు.
భారత్ పర్యటన తన ఆలోచనా విధానాన్నే మార్చేసిందని జెమా తెలిపారు. ఇకపై తన కళ ద్వారా భారత చరిత్ర, సంస్కృతి గురించి ప్రపంచానికి మరింత చెప్పాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ‘‘India wasn't poor, it was made poor’’ అన్న భావనతో చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి.