‘లింఫాటిక్ వాకింగ్’.. ఏంటీ వైరల్ వెల్‌నెస్ ట్రెండ్? ఎలాంటి ప్రయోజనాలుంటాయి?
- ఇది సాధారణ నడకకు కొన్ని మార్పులు జోడించే విధానం
- నిటారుగా ఉండి చురుగ్గా నడవాలని నిపుణుల సూచన
- చేతుల సహజ కదలికలు, లోతైన శ్వాసకు ప్రాధాన్యం
- ఎక్కువసేపు కూర్చునేవారికి క్రమం తప్పని నడక ఉపయోగకరం
- లింఫాటిక్ వాకింగ్ ప్రత్యేక ‘డిటాక్స్’ చికిత్స కాదన్న నిపుణులు
వెల్‌నెస్ ట్రెండ్స్ రోజుకో కొత్త రూపం దాలుస్తున్నాయి. జిమ్‌కు వెళ్లాలి.. గంటల తరబడి వర్కౌట్స్ చేయాలి.. హెచ్‌ఐఐటీ, బర్పీస్ అంటూ చెమటలు పట్టించుకోవాలి అనుకునే వారికి ఇప్పుడు ఓ సింపుల్ ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే ‘లింఫాటిక్ వాకింగ్’. ఇందులో ప్రత్యేకమైన పరికరాలు అవసరం లేదు. తెల్లవారుజామునే లేచి నడవాల్సిన పనీ లేదు. సాధారణంగా నడుస్తూనే కొన్ని చిన్న మార్పులు చేస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇంతకీ లింఫాటిక్ వాకింగ్ అంటే ఏంటి? నిజంగానే ఇది శరీరంలోని ‘టాక్సిన్స్’ను బయటకు పంపిస్తుందా? పొట్ట ఉబ్బరం, శరీరంలో నీరు నిలవడం తగ్గుతుందా? సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఈ ట్రెండ్ వెనుక నిజమెంత? తెలుసుకుందాం.
లింఫాటిక్ సిస్టమ్ అంటే ఏంటి?
మన శరీరంలో అదనంగా చేరిన ద్రవాన్ని తిరిగి రక్తప్రసరణలోకి పంపడంలో లింఫాటిక్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. రోగనిరోధక వ్యవస్థలోనూ ఇది ముఖ్యమైన భాగం. దీనికి గుండెలా ఒక ప్రత్యేకమైన కేంద్ర పంపు ఉండదు. కండరాల కదలికలు, శ్వాసతో ఏర్పడే ఒత్తిడి మార్పులు లింఫ్ ద్రవం కదలడానికి సహాయపడతాయి.
అందుకే నడకలో కాళ్ల కండరాలు పనిచేయడం లింఫ్ ద్రవం కదలికకు సహాయపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. లింఫాటిక్ వాకింగ్ పేరుతో కొత్త వ్యాయామం వచ్చినట్లు కనిపించినా.. వాస్తవానికి ఇది సాధారణ నడకకు కొన్ని చిన్న మార్పులు జోడించిన విధానమే.
ఎలా నడవాలి?
నడిచేటప్పుడు శరీరాన్ని నిటారుగా ఉంచాలి. వేగం మరీ ఎక్కువగా కాకుండా.. సౌకర్యంగా, కాస్త చురుగ్గా నడవాలి. చేతులను సహజంగా ఊపుతూ నడవాలి. ఫోన్ చూస్తూ తల వంచి, భుజాలు ముందుకు వంచుకుని నడవడం కాకుండా శరీర కదలికలపై దృష్టి పెట్టాలి.
దీనికి లోతైన, డయాఫ్రాగ్మాటిక్ శ్వాసను జోడించవచ్చు. డయాఫ్రాగ్మాటిక్ బ్రీతింగ్ శ్వాసను మరింత సమర్థంగా తీసుకోవడంలో సహాయపడుతుంది.
ప్రయోజనాలు నిజమేనా?
నడక వల్ల కండరాలు పనిచేస్తాయి. ఎక్కువసేపు కూర్చునే జీవనశైలికి ఇది మంచి ప్రత్యామ్నాయం. కాళ్ల కండరాల కదలిక రక్తప్రసరణకు సహాయపడుతుంది. లింఫాటిక్ వ్యవస్థలో ద్రవం కదలికకూ శారీరక కదలిక ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చునే వారు క్రమం తప్పకుండా నడవడం ప్రయోజనకరమే. లింఫెడీమా వంటి సమస్యల్లోనూ వ్యాయామం చికిత్సలో భాగంగా ఉపయోగపడుతుంది.
అయితే సోషల్ మీడియాలో చెప్పినట్లుగా లింఫాటిక్ వాకింగ్ ఏదో ప్రత్యేకమైన ‘డిటాక్స్ ట్రీట్‌మెంట్’ అని భావించాల్సిన అవసరం లేదు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ లింఫ్ డ్రైనేజ్ కోసం ప్రత్యేకంగా ఈ విధానాన్ని పాటించాల్సిన అవసరం లేదని నిపుణుల అభిప్రాయం. అలాగే బరువు తగ్గడానికి ఇది ఏదైనా రహస్య మార్గం కాదు.
మరి ఎవరికి ఉపయోగం?
ఎక్కువసేపు కూర్చునే ఉద్యోగాలు చేసేవారు, ఎక్కువసేపు ప్రయాణించే వారు, తీవ్రమైన వ్యాయామాలు చేయలేని వారు క్రమం తప్పకుండా నడవడంపై దృష్టి పెట్టవచ్చు. అయితే లింఫెడీమా, లింఫ్ నోడ్స్ తొలగింపు లేదా దెబ్బతినడం, లింఫాటిక్ డ్రైనేజ్‌లో సమస్యలు ఉన్నవారు మాత్రం వైద్యుల సూచనతో వ్యాయామం చేయడం మంచిది.
అన్నింటికంటే ముఖ్యంగా.. లింఫాటిక్ వాకింగ్ పేరుతో ప్రత్యేకంగా ఏదో చేయాల్సిన అవసరం లేదు. కదలకుండా కూర్చోవడం కంటే క్రమం తప్పకుండా నడవడమే అసలు విషయం. ఒక్కసారిగా అతిగా నడవడం లేదా శరీర సామర్థ్యానికి మించి వ్యాయామం చేయడం వల్ల అలసట, కండరాల నొప్పులు, తల తిరగడం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి నెమ్మదిగా మొదలుపెట్టి క్రమంగా పెంచడం మంచిది.