త్వరలో వైఎస్ షర్మిల కుమార్తె అంజలి వివాహం.. కాబోయే అల్లుడు ఎవరంటే?
- వైఎస్ షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహం నిశ్చయం
- అమెరికాలో డాక్టర్‌గా పనిచేస్తున్న రఘురామరెడ్డితో పెళ్లి
- వరుడి కుటుంబం కర్నూలు జిల్లాకు చెందిన వారు
- సోషల్ మీడియా వేదికగా శుభవార్తను ప్రకటించిన షర్మిల
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆమె కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహం నిశ్చయమైంది. ఈ శుభవార్తను షర్మిల స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రజలతో పంచుకున్నారు. తన కుమార్తె అంజలితో పాటు కాబోయే అల్లుడు డాక్టర్ రఘురామరెడ్డి ఫొటోను షేర్ చేస్తూ, ఈ ఆనందకరమైన విషయాన్ని వెల్లడించారు.
కర్నూలు జిల్లాకు చెందిన సోమల సుబ్బారెడ్డి, పద్మారెడ్డి దంపతుల కుమారుడు డాక్టర్ రఘురామరెడ్డితో అంజలి వివాహం జరగనుంది. వరుడి కుటుంబం అమెరికాలో స్థిరపడిందని, వారంతా అమెరికా పౌరులని షర్మిల తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ఓ భావోద్వేగ పోస్ట్ చేశారు.
"నా భర్త అనిల్ కుమార్, నేను దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మా కుమార్తె అంజలి రెడ్డి వివాహం డాక్టర్ రఘురామ్ రెడ్డితో నిశ్చయమైన శుభవార్తను మీతో పంచుకుంటున్నాము. ఈ శుభ సందర్భంలో స్నేహితులు, శ్రేయోభిలాషులందరి ప్రార్థనలు, ఆశీస్సులు మా కుటుంబానికి అందించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం" అని ఆమె పేర్కొన్నారు.
కాబోయే వధూవరులిద్దరూ అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి, అక్కడే ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వైఎస్ అంజలి రెడ్డి బీబీఏ పూర్తి చేసి, ప్రస్తుతం ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా పనిచేస్తున్నారు. కాబోయే వరుడు రఘురామరెడ్డి యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్‌లో మెడిసిన్ చదివి, ప్రస్తుతం టెన్నెస్సీలోని నాష్‌విల్‌లో డాక్టర్‌గా సేవలు అందిస్తున్నారు.
వైఎస్ షర్మిలకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆమె కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం అట్లూరి ప్రియతో జోధ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. అప్పుడు షర్మిల స్వయంగా తాడేపల్లికి వెళ్లి తన అన్న, సీఎం జగన్‌ను పెళ్లికి ఆహ్వానించారు. అయితే, రాజారెడ్డి నిశ్చితార్థానికి హాజరైన జగన్, పెళ్లికి మాత్రం దూరంగా ఉన్నారు. ఇప్పుడు కుమార్తె వివాహంతో షర్మిల ఇంట మరోసారి పెళ్లి సందడి నెలకొంది.