ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా.. ఎవరీమె? బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
- మిస్ వరల్డ్ 2026గా డొమినికన్ రిపబ్లిక్ భామ జొహైరీ మోలా
- వియత్నాంలో జరిగిన 73వ ఎడిషన్ పోటీల్లో విజయం
- 44 ఏళ్ల తర్వాత డొమినికన్ రిపబ్లిక్‌కు దక్కిన ప్రపంచ సుందరి కిరీటం
- రన్నరప్‌లుగా స్పెయిన్, మలేషియా సుందరీమణులు
ప్రతిష్ఠాత్మక మిస్ వరల్డ్ 2026 కిరీటాన్ని డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన జొహైరీ మోలా డొమింగ్యూజ్ గెలుచుకున్నారు. వియత్నాంలోని న్హా ట్రాంగ్‌లో శనివారం రాత్రి అట్టహాసంగా జరిగిన 73వ మిస్ వరల్డ్ ఫైనల్స్‌లో ఆమె విజేతగా నిలిచారు. గత ఏడాది విజేత, థాయ్‌లాండ్‌కు చెందిన సుచతా చువాంగ్‌శ్రీ.. జొహైరీకి కిరీటాన్ని అలంకరించారు. ఈ విజయంతో దాదాపు 44 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత డొమినికన్ రిపబ్లిక్‌కు మిస్ వరల్డ్ టైటిల్ దక్కింది. 1982లో మరియాసెలా అల్వారెజ్ ఆ దేశం తరఫున తొలిసారి ఈ కిరీటాన్ని గెలుచుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా 110 దేశాల నుంచి వచ్చిన సుందరీమణులతో పోటీపడి జొహైరీ మోలా ఈ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఈ పోటీలో స్పెయిన్‌కు చెందిన ఎలిసబెత్ రేనెస్ ఫస్ట్ రన్నరప్‌గా, మలేషియాకు చెందిన తానుసియా శెట్టి సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. వియత్నాం, ఎరిత్రియా, దక్షిణాఫ్రికా దేశాల ప్రతినిధులు టాప్ 6లో స్థానం సంపాదించారు. వియత్నాం మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం.
24 ఏళ్ల జొహైరీ మోలా విద్య, మోడలింగ్, జర్నలిజం వంటి బహుళ రంగాల్లో రాణిస్తున్నారు. యూనివర్సిడాడ్ ఇబెరోఅమెరికానా నుంచి బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేసిన ఆమె.. ఒకవైపు ప్రొఫెషనల్ మోడల్‌గా కొనసాగుతూనే, మరోవైపు సాహిత్యం, సోషల్ స్టడీస్ టీచర్‌గా పనిచేస్తున్నారు. అంతేకాకుండా, యూనివిజన్ న్యూయార్క్ ఛానెల్ కోసం న్యూస్ కరస్పాండెంట్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆమెకు స్పానిష్, ఇంగ్లిష్ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉంది.
"వాయిసెస్ ఆఫ్ టుమారో" పేరుతో జొహైరీ స్థాపించిన సేవా కార్యక్రమం ఆమె విజయానికి బాటలు వేసింది. పేద వర్గాల పిల్లలు, యువతకు ఇంగ్లీష్ విద్యను అందించడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. ఫైనల్ రౌండ్‌లోనూ ఇదే అంశంపై మాట్లాడుతూ.. "పేద పిల్లలకు ఇంగ్లిష్ విద్యను అందించడం వారి జీవితాల్లో గొప్ప అవకాశాలకు తలుపులు తెరుస్తుంది" అని ఆమె చెప్పిన సమాధానం న్యాయనిర్ణేతలను ఎంతగానో ఆకట్టుకుంది. "బ్యూటీ విత్ ఎ పర్పస్" అనే మిస్ వరల్డ్ నినాదానికి ఆమె నేపథ్యం, లక్ష్యాలు సరిగ్గా సరిపోవడంతో విజయం ఆమెను వరించింది.