హైదరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్ల ఆగడాలపై డీజీపీ సీవీ ఆనంద్ సీరియస్
- ట్రాన్స్‌జెండర్ల బలవంతపు వసూళ్లపై స్పెషల్ డ్రైవ్‌కు డీజీపీ ఆదేశం
- గతంలోనూ ఇలాంటి దందాలను అరికట్టామని వెల్లడి
- చింతల్‌లో గృహప్రవేశం వద్ద రూ. 50 వేలు డిమాండ్ చేసిన ఘటన వైరల్
- ప్రభుత్వ ప్రోత్సాహంతో పలువురు ట్రాన్స్‌జెండర్లు మంచి పేరు తెచ్చుకున్నారని ప్రశంస
- అన్ని కమిషనరేట్ల పరిధిలో తనిఖీలు చేపట్టాలని పోలీసులకు సూచన
కొందరు ట్రాన్స్‌జెండర్లు శుభకార్యాల వద్ద బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి బెదిరింపులు, దోపిడీలను అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా మరోసారి ప్రత్యేక డ్రైవ్ (స్పెషల్ డ్రైవ్) చేపట్టాలని అన్ని కమిషనరేట్ల సీపీలను ఆదేశించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇటీవల హైదరాబాద్‌లోని చింతల్‌లో ఓ గృహప్రవేశ వేడుకలో ట్రాన్స్‌జెండర్లు రూ. 50,000 డిమాండ్ చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో డీజీపీ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సెప్టెంబర్ 4న చింతల్ ప్రాంతంలో ఓ కుటుంబం తమ నూతన గృహంలోకి ప్రవేశించేందుకు రాగా, కొందరు ట్రాన్స్‌జెండర్లు వారిని అడ్డుకున్నారు. ఇంట్లోకి వెళ్లాలంటే రూ. 50,000 ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. అంత మొత్తం ఇచ్చుకోలేమని బాధితులు చెప్పినా వినకుండా అసభ్యంగా ప్రవర్తించి, శాపనార్థాలు పెట్టారని బాధితురాలు వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాపించడంతో, ఇలాంటి వసూళ్ల దందాలపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు పోలీసులను కోరారు.
ఈ ఘటనపై స్పందించిన డీజీపీ సీవీ ఆనంద్, ఇటీవల కాలంలో ఇలాంటి ఫిర్యాదులు తన దృష్టికి వస్తున్నాయని అంగీకరించారు. తాను హైదరాబాద్ సీపీగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి బెగ్గింగ్ రాకెట్లు, బలవంతపు వసూళ్లపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి నియంత్రించినట్లు గుర్తుచేశారు. ఇప్పుడు మళ్లీ అదే తరహా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
అదే సమయంలో, ట్రాన్స్‌జెండర్ల జీవనోపాధికి తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని డీజీపీ ప్రస్తావించారు. ప్రభుత్వ చొరవతో ఎందరో ట్రాన్స్‌జెండర్లు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా, ఇతర విభాగాల్లో ఉద్యోగాలు పొంది ఎలాంటి ఫిర్యాదులు లేకుండా మంచి పేరు తెచ్చుకుంటున్నారని ఆయన వివరించారు.