వైభవ్ సూర్యవంశీపై తిలక్ వర్మ స్లెడ్జింగ్.. అర్ధశతకం చేజార్చుకున్న యువ సంచలనం.. ఫ్యాన్స్ ఫైర్!
- దులీప్ ట్రోఫీ ఫైనల్లో 15 ఏళ్ల వైభవ్‌పై తిలక్ వర్మ స్లెడ్జింగ్
- 44 పరుగుల వద్ద ఔటైన యువ సంచలనం సూర్యవంశీ
- తిలక్ తీరుపై సోషల్ మీడియాలో అభిమానుల అసంతృప్తి
- మరో ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ మెరుపు అర్ధశతకం (72)
దులీప్ ట్రోఫీ ఫైనల్లో యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మరోసారి తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. నేడు సౌత్ జోన్‌తో ప్రారంభమైన ఫైనల్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేసి అర్ధశతకానికి చేరువలో ఔటయ్యాడు. అయితే, అతను ఔటవడానికి ముందు సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మతో జరిగిన ఓ చిన్న సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తిలక్ వర్మ, వైభవ్‌ను ఉద్దేశించి స్లెడ్జింగ్ చేయగా, ఆ తర్వాత కొద్దిసేపటికే వైభవ్ తన వికెట్ కోల్పోయాడు.
మ్యాచ్ సమయంలో తిలక్ వర్మ.. "ఏంటి యార్ ఈ వైస్ కెప్టెన్" అంటూ వైభవ్‌ను రెచ్చగొట్టేలా మాట్లాడటం వినిపించింది. అయితే, ఈ సంఘటన తర్వాత ఇద్దరు ఆటగాళ్లు నవ్వుతూ కనిపించడంతో దీన్ని సీరియస్‌గా తీసుకోనట్లు అనిపించింది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం అభిమానులు తిలక్ తీరును తప్పుబడుతున్నారు. 15 ఏళ్ల కుర్రాడిపై స్లెడ్జింగ్ వ్యూహం అవలంబించడం సరికాదని పలువురు విమర్శలు గుప్పించారు. ఈ స్లెడ్జింగ్ తర్వాత చామ మిలింద్ బౌలింగ్‌లో వైభవ్ ఔటయ్యాడు.
అంతకుముందు వైభవ్ తన ఇన్నింగ్స్‌ను ఎంతో దూకుడుగా ప్రారంభించాడు. భారత సీనియర్ పేసర్ మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లోనూ అద్భుతమైన షాట్లు ఆడాడు. మొత్తం మీద 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 44 పరుగులు సాధించాడు. వైభవ్ దూకుడైన ఆటతీరు మరో ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్‌పైనా ప్రభావం చూపినట్లు కనిపించింది. ఈశ్వరన్ కూడా దూకుడుగా ఆడి 86 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 72 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో శుభారంభం చేసింది.