చనిపోయాడనుకున్న కొడుకు బతికే ఉన్నాడు.. అంత్యక్రియల 15 రోజుల తర్వాత తెలిసిన అసలు నిజం!
- చనిపోయాడనుకుని కొడుక్కి అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబం
- కర్మకాండలు ముగిసిన 15 రోజుల తర్వాత జైలు నుంచి ఫోన్ కాల్
- జైలులో బతికే ఉన్న కొడుకును చూసి ఆశ్చర్యపోయిన పేరెంట్స్
- గుర్తుతెలియని మృతదేహాన్ని తమ కొడుకుగా పొరబడటమే కారణం
- పంజాబ్‌లోని కపుర్తలాలో జరిగిన విచిత్ర ఘటన
చనిపోయాడనుకున్న ఆత్మీయులకు కర్మకాండలు నిర్వహించడం, ఆ తర్వాత వారు బతికే ఉన్నారని తెలిస్తే ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుంది? మాటల్లో చెప్పలేని ఆనందం, ఆశ్చర్యం కలగలిసిన ఇలాంటి వింత ఘటనే పంజాబ్‌లో చోటుచేసుకుంది. కనిపించకుండా పోయిన తమ కుమారుడు మరణించాడని భావించి, ఒక మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించిన కుటుంబానికి.. కొద్దిరోజుల తర్వాత అతడు జైలులో బతికే ఉన్నాడని తెలిసి ఆనందంలో మునిగిపోయింది.
వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌లోని కపుర్తలాకు చెందిన రవి కుమార్ అనే యువకుడు ఆగస్టు 5న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. అతని తండ్రి, సోదరుడు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో వారి ప్రయత్నాలు విఫలమవడంతో, ఆగస్టు 11న కపుర్తలా సిటీ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో, పోలీసులకు పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న ఒక యువకుడి మృతదేహం లభ్యమైనట్టు కుటుంబానికి సమాచారం అందింది.
పోలీసులు చూపించిన ఫొటోలను చూసి, ఆ మృతదేహం రవి కుమార్‌దేనని కుటుంబ సభ్యులు, బంధువులు నిర్ధారించారు. దీంతో తమ కుమారుడు మరణించాడని తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన ఆ కుటుంబం, ఆగస్టు 13న ఆ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేసింది. తమ కుమారుడు ఇక లేడని భావిస్తూ వారు శోకసంద్రంలో మునిగిపోయారు.
అయితే, ఈ కథలో ఊహించని మలుపు సెప్టెంబర్ 2న చోటుచేసుకుంది. కపుర్తలా సెంట్రల్ జైలు నుంచి కుటుంబ సభ్యులకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. రవి కుమార్ అనే వ్యక్తి జైలులో ఉన్నాడని, వచ్చి కలవాలని జైలు సిబ్బంది సమాచారం అందించారు. నిజానికి, రవి కుమార్‌ను సుమారు నెల క్రితమే జలంధర్ పోలీసులు అనుమానాస్పదంగా తిరుగుతున్నాడనే కేసులో అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఈ విషయం తెలియని కుటుంబం, జైలు నుంచి వచ్చిన ఫోన్‌తో తీవ్ర గందరగోళానికి, ఆశ్చర్యానికి గురైంది.
మరుసటి రోజు, సెప్టెంబర్ 3న కుటుంబ సభ్యులు జైలుకు వెళ్లారు. అక్కడ తమ కళ్ల ముందే బతికి ఉన్న కొడుకును చూసి వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దుఃఖంలో ఉన్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా సంతోషం వెల్లివిరిసింది. తమ కుమారుడు బతికే ఉన్నందుకు సంతోషిస్తున్నప్పటికీ, తాము అంత్యక్రియలు నిర్వహించింది ఎవరికి? అనే ప్రశ్న ఇప్పుడు మిగిలిపోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.