బీజేపీలో చేరిన టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ

Shrashti Verma Famous Choreographer Joins BJP
  • తెలంగాణ బీజేపీలో చేరిన ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర అధ్యక్షుడు
  • 'ఢీ', 'బిగ్‌బాస్' షోలతో పాటు పలు హిట్ సినిమాలకు పనిచేసిన శ్రష్టి
ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. సోమవారం ఆమె బీజేపీలో చేరారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ, దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు ఏకమవుతున్న తరుణంలో, యువత రాజకీయాల్లోకి రావడం, ముఖ్యంగా బీజేపీలో చేరడం శుభపరిణామమని పేర్కొన్నారు. యువత ప్రాతినిధ్యంతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రష్టి వర్మతో పాటు పలువురు ఈ కార్యక్రమంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన శ్రష్టి వర్మ, ఈటీవీలో ప్రసారమైన 'ఢీ', 'ఢీ జోడీ' వంటి డ్యాన్స్ రియాలిటీ షోల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలయ్యారు. అనంతరం ఆమె 'బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9'లో కంటెస్టెంట్‌గా కూడా పాల్గొన్నారు. కొరియోగ్రాఫర్‌గా తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమలలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇటీవల విడుదలైన 'పుష్ప 2'లోని 'సూసేకి', రజినీకాంత్ 'జైలర్' చిత్రంలోని 'నువ్వు కావాలయ్యా' వంటి బ్లాక్‌బస్టర్ గీతాలకు నృత్య దర్శకత్వం వహించారు. వీటితో పాటు 'అల వైకుంఠపురములో', 'క్రాక్', 'బీస్ట్', 'గేమ్ ఛేంజర్' వంటి పలు విజయవంతమైన చిత్రాలకు ఆమె పనిచేశారు.
Advertisement
Shrashti Verma
BJP
Choreographer
Bigg Boss Telugu Season 9
N Ramchander Rao
Pushpa 2

More Telugu News