తాతయ్య, నాన్నమ్మ కథలు చెబితే పిల్లలకు ఇన్ని ప్రయోజనాలా? సైన్స్ చెబుతున్న 3 విషయాలు
- ఇంట్లో తాతాయ్య, నాన్మమ్మలు చెప్పే కథలతో పిల్లలకు ఎన్నో ప్రయోజనాలు
- కుటుంబ నేపథ్యం, పెద్దల అనుభవాలు తెలుసుకునే అవకాశం
- కొత్త పదాలు, వాక్య నిర్మాణాలు, వివరణలు, సంభాషణలు నేర్చుకునే ఛాన్స్
- సామాజిక, భావోద్వేగ నైపుణ్యాలు అభివృద్ధి అవకాశం
తాతయ్య, నాన్నమ్మల దగ్గర కూర్చొని వాళ్ల చిన్ననాటి కథలు వినడం పిల్లలకు ఓ మధురమైన జ్ఞాపకం. కుటుంబంలో జరిగిన సంఘటనలు, తల్లిదండ్రుల చిన్ననాటి అనుభవాలు, కష్టాలను ఎలా ఎదుర్కొన్నారనే విషయాలు పిల్లల ఆలోచనా విధానంపై కూడా ప్రభావం చూపుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ కథలు పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం, భాషా నైపుణ్యాలను మెరుగుపరచడం, ఇతరులతో అనుబంధాన్ని బలోపేతం చేయడంలో ఉపయోగపడతాయి.
1. ‘నేను ఎవరు?’ అనే భావన బలపడుతుంది
పిల్లలు తమ గురించి తెలుసుకునే క్రమంలో కుటుంబ కథలకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. కుటుంబంలో జరిగిన విషయాలను పిల్లలకు పెద్దలు చెప్పినప్పుడు తమ కుటుంబ నేపథ్యం, తమ తల్లిదండ్రుల అనుభవాలు, ఎదుర్కొన్న కష్టాల గురించి పిల్లలకు తెలుస్తుంది. ఉదాహరణకు.. ‘మీ అమ్మ కూడా చిన్నప్పుడు స్కూల్‌కి వెళ్లడానికి భయపడేది’ అని అమ్మమ్మ చెబితే.. తనకే ఎదురవుతున్న సమస్య కాదని పిల్లలకు అర్థమవుతుంది. ఇలాంటి కథలు కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని, నేను అనే ఆత్మవిశ్వాసాన్ని పెంచే అవకాశం ఉంటుంది.
2. భాషా నైపుణ్యాలు
కథలు వినేటప్పుడు పిల్లలు కొత్త పదాలు, వాక్య నిర్మాణాలు, వివరణలు, సంభాషణలు వింటారు. ఒక సంఘటన మొదలై.. దాని తర్వాత ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి వారు శ్రద్ధగా వినాలి. ముఖ్యంగా చిన్న పిల్లల్లో కథలను అర్థం చేసుకునే సామర్థ్యానికి పదజాలం, వ్యాకరణ పరిజ్ఞానం కీలకమని పరిశోధనలు సూచిస్తున్నాయి. తాతయ్య, నాన్నమ్మలు చెప్పే భిన్నమైన కథలు పిల్లలకు కొత్త పదాలు, కొత్త అనుభవాలను పరిచయం చేయగలవు.
3. భావోద్వేగాలను అర్థం చేసుకోవడం
తాతయ్య లేదా నాన్నమ్మ ఒకప్పుడు తాము ఎదుర్కొన్న భయం, నిరాశ, సంతోషం లేదా వైఫల్యం గురించి చెప్పినప్పుడు పిల్లలు కేవలం కథ వినడం మాత్రమే చేయరు. ‘అప్పుడు మీకు ఎలా అనిపించింది?’, ‘తర్వాత ఏం చేశారు?’ అంటూ ప్రశ్నలు అడుగుతారు. దీంతో ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం, తమ అనుభవాలతో పోల్చుకోవడం వంటి సామాజిక, భావోద్వేగ నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. తాతయ్య, నాన్నమ్మలతో ఏర్పడే ఆప్యాయమైన అనుబంధం కూడా పిల్లల సామాజిక నైపుణ్యాలకు మేలు చేస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
అసలు కథలో ఉన్న మ్యాజిక్ ఇదే..
తాతయ్య, నాన్మమ్మ కథలు పిల్లలకు పెద్ద జీవిత పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్లు చిన్నప్పుడు చేసిన అల్లరి, ఎదుర్కొన్న కష్టం, మొదటి ఉద్యోగం, స్కూల్ అనుభవం.. ఇలా ఏ చిన్న జ్ఞాపకమైనా పిల్లలకు విలువైనదే. అందుకే వాళ్లు కథ చెబుతున్నప్పుడు ఫోన్ పక్కన పెట్టి పిల్లలను కాసేపు విననివ్వండి. ఏళ్ల తర్వాత పిల్లల మనసులో నిలిచిపోయేది పెద్దలు చెప్పిన ఉపదేశం కాకపోవచ్చు.. తమ పక్కనే కూర్చొని తాతయ్య, నాన్నమ్మ చెప్పిన ఆ చిన్న కథే కావచ్చు.