ఓటీటీకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్: ఒక బ్యాంక్ దోపిడీ .. ఒక క్లర్క్ చుట్టూ తిరిగే కథ!
- మలయాళంలో రూపొందిన 'ఐ నోబడీ'
- ప్రధానమైన పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్
- జులై 9న విడుదలైన సినిమా
- ఈ నెల 25వ తేదీ నుంచి జియో హాట్ స్టార్ లో
- ఐదు భాషల్లో అందుబాటులోకి
బ్యాంకులోని డబ్బును కొల్లగొట్టడానికి ఒక ముఠా ప్లాన్ చేయడం .. ఆ డబ్బుకు హీరో బాధ్యత వహించవలసి రావడం .. చివరికి ఆ దొంగలను ఎదిరించి తనపై పడిన నిందను తుడిచేయడం వంటి కథలతో గతంలో చాలానే కథలు వచ్చాయి. బ్యాంకులో దొంగతనం చేసిన అనంతరం దొంగలు పారిపోతూ తమతో పాటే హీరోను తీసుకుపోతే, మార్గ మధ్యంలో ఆ దొంగలంతా చనిపోతే .. అనే కథాంశంతో కొత్తదనానికి తెరలేపిన సినిమానే 'ఐ నోబడీ'.
పృథ్వీరాజ్ సుకుమారన్ - పార్వతీ తిరువోతు ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, జులై 9వ తేదీన థియేటర్లకు వచ్చింది. సుప్రియా మీనన్ - ముఖేశ్ మెహతా నిర్మించిన ఈ సినిమాకి, నిస్సామ్ బషీర్ దర్శకత్వం వహించాడు. హకీమ్ షాజహాన్ .. ఆశోకన్ .. మధుపాల్.. విజయ్ రాఘవన్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ నెల 25వ తేదీ నుంచి 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు .. తమిళ .. కన్నడ .. హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.
కథలోకి వెళితే .. రాజీవన్ ఒక బ్యాంకులో క్లర్క్ గా పనిచేస్తుంటాడు. ఒకరోజున దోపిడీ దొంగల ముఠా ఆ బ్యాంకు పై విరుచుకుపడుతుంది. 17 కోట్ల రూపాయలను దోచేస్తుంది. అక్కడి నుంచి పారిపోతూ, రాజీవన్ అవసరం పడుతుందనే ఉద్దేశంతో అతణ్ణి వెంటబెట్టుకుని వెళతారు. ఆ వాహనం పెద్ద ప్రమాదానికి గురికావడంతో, ఆ దొంగలంతా చనిపోతారు. డబ్బు సంచులు కనిపించకుండా పోతాయి. రాజీవన్ మాత్రం ప్రాణాలతో మిగిలిపోతాడు. ఆ తరువాత అతను ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వచ్చింది? అనేదే కథ.